Samantha : బాలయ్య అక్కినేని.. తొక్కినేని వ్యాఖ్యలపై సమంత ఏమందో తెలుసా?



Samantha : నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలయి ఘన విజయాన్ని అందుకుంది.. బాలయ్య కెరీర్‌లో అఖండ తర్వాత వరుసగా రెండో బ్లాక్‌బస్టర్ సినిమాగా వీరసింహారెడ్డి రికార్డులను బ్రేక్ చేసింది.

Samantha
Samantha

ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో విజయోత్సవ సభను చిత్ర యూనిట్ నిర్వహించారు.. ఈ సభలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు కాస్త కాంట్రవర్సీగా మారాయి. బాలయ్య తనకు అలవాటైన రీతిలో లోపల ఉన్నది ఉన్నట్టు దాచుకోకుండానే పైకి అనేశారు.. మాటల్లో అక్కినేని.. తొక్కినేని అన్నారు.. అది కాస్త ఇండస్ట్రీలో దుమారం రేపుతుంది అక్కినేని ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వార్ కూడా అయ్యింది.

Balakrishna

వీరసింహారెడ్డి ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ..అప్పటి రోజుల్లో సినిమా కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరిని అభినందించారు. వాళ్ళతో మంచి అనుబంధం ఉందని, బాగా టైం పాస్ అయ్యిందని చెపుతూనే వారంతా షూటింగ్ స్పాట్‌లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు గారు.. ఈ రంగారావు గారు, అక్కినేని, తొక్కినేని అంటూ అన్నీ మాట్లాడుకునే వాళ్లమని బాలయ్య చెప్పాడు. నిజానికి బాలయ్య ఉద్దేశ్యం మాత్రం అప్పటి రోజులను గుర్తు చేసుకున్నామంటూ చెప్పే క్రమంలో తొక్కినేని అనే మాట నోరు జారారు.. అది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

Akkineni family balakrishna

అంతేకాదు.. దీన్ని పదే పదే చెబుతూ.. సోషల్ మీడియాలో కొందరు కావాలని రాద్దాంతం చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై అక్కినేని హీరో నాగచైతన్య కూడా స్పందించారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌.వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు.. వారిని అగౌరవపరిస్తే.. మనలను మనం అగౌరవపరుచుకున్నట్టే ఆయనవ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగాఓ పోస్ట్ పెట్టాడు. దీనినే అఖిల్ కూడా షేర్ చేశాడు. ఇది ఇలా ఉండగా ఈ విషయం పై తాజాగా..స‌మంత కూడా స్పందించిన‌ట్లు తెలుస్తుంది.

Akhil Akkineni Tweet

బాల‌య్య నోట అలాంటి మాట రావ‌డం బాధాక‌ర‌మ‌ని, పొర‌పాటున ఫ్లోలో వ‌చ్చి ఉండ‌వ‌చ్చ‌ని, అలాగే మనకు ఒకదారి చూపిన వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చెయ్యడం తప్పు అని బాలయ్య వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ట్లు సమాచారం. అంటే సమంత అక్కినేని ఫ్యామిలీ తో సమంత మళ్ళీ కలవబోతుందా? ఇక ఈ విషయం ఎన్ని వివాదాలకు తెర లేపుతుందో చూడాలి మరి..