Star Maa: శ్రీసత్య అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఆ మాట చెప్పేసిందా.!?

- Advertisement -

Sri Satya : శ్రీముఖి యాంకర్ గా స్టార్ మా లో ఆదివారం ప్రసారం అవుతున్న స్టార్ మా పరివారం షో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. వచ్చే ఆదివారం ఈ షో కి బిగ్ బాస్ జోడి కంటెస్టెంట్స్ రానున్నారు.. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా.. క్షణాల్లో వైరల్ అయింది.. బిగ్ బాస్ జోడి కంటెస్టెంట్స్ చేసిన అల్లరి తోపాటు శ్రీ సత్య అర్జున్ ల క్లోజప్ షాట్స్ అదిరిపోయాయి..

ఈ షో కి బిగ్ బాస్ జోడి కంటెస్టెంట్స్ అవినాష్ – అరియనా, రవికృష్ణ – భాను, సూర్య – ఫైమా, అర్జున్ – వాసంతి, మహబూబ్ – శ్రీ సత్య వచ్చారు.. కాగా ఈ షోలో ఫైమా తన పంచ్ డైలాగులతో అందర్నీ అలరించింది.. ముక్కు అవినాష్ కామెడీ ఓ రేంజ్ లో పండించాడు.. మొత్తానికి ఈ ప్రోమోలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు.. అవినాష్ మీద వచ్చే సెటైరికల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి..

sri satya
sri satya

ఇక మహబూబ్ శ్రీ సత్య కలిసి మధురం మధురం సాంగ్ కి స్టెప్పులు వేశారు.. ఇక మహబూబ్ శ్రీ సత్య ఎత్తుకుని ఓ రేంజ్ లో పర్ఫామెన్స్ చేశారు.. పర్ఫామెన్స్ వాళ్ళు అక్కడే చేస్తుంటే మ్యూజిక్ మాత్రం ఇక్కడ వచ్చింది అంటూ శ్రీముఖి అర్జున్ వైపు చూపిస్తుంది.. మండుతున్నట్టు ఉంది అని అర్జున్ పై అవినాష్ సెటైర్ వేస్తాడు.. నేనెక్కడుంటే అక్కడే మ్యూజిక్ అని అర్జున్ కవర్ చేసుకుంటాడు. సరే అలాగే.. అయితే నేను ఈ పాట ప్లే చేస్తాను.. ఇద్దరూ ఎదురు బొదురుగా నుంచొని 30 సెకండ్లు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోండి అని శ్రీముఖి అంటుంది.. ఆ మాటలకు శ్రీ సత్య బుంగమూతి పెట్టుకుంటుంది..

- Advertisement -

అరేయ్ స్పాట్ లైట్ పెట్టండిరా అంటూ శ్రీముఖి వాళ్ళిద్దర్నీ ఇంకా హైలైట్ చేస్తుంది.. వామ్మో వద్దు అని శ్రీ సత్య అంటే.. బావ కంఫర్ట్ కదా అంటూ ఆర్ జె సూర్య సెటైర్ వేస్తాడు.. దాంతో షోలో నవ్వులు పూస్తాయి.. నే నిన్నటి రవినే.. నువ్వు రేపటి శశివే.. మొత్తానికి ఒకరి కళ్లలోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటారు .. ఇక అది అయిపోయాక మీరిద్దరూ కళ్ళతో ఏదో మాట్లాడుకున్నారు అంటూ శ్రీముఖి పంచ్ వేస్తుంది.. కళ్ళు డ్రై అయిపోతున్నాయని.. నేను మధ్యలో కళ్ళు ఆర్పాను అంటూ శ్రీ సత్య కవర్ చేస్తుంది.. నన్ను చూస్తుంటే నీకు కళ్ళు నొప్పులు పుడుతున్నాయా అని అర్జున్ అంటాడు.. అంత లేదమ్మా అని శ్రీ సత్య అంటుంది.. అర్జున్ ఎంత ట్రై చేసినా కానీ శ్రీ సత్య తనకు పడనని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తూనే ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here