Adivi Sesh : శేష్ డేట్​కు ఎప్పుడెళ్దాం.. హిట్-2 హీరో రిప్లైకు అమ్మాయిలు ఫిదా

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ Adivi Sesh న‌టించిన లేటెస్ట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ హిట్ 2. హిట్​కు సీక్వెల్​గా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీతో శేష్ డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్​లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఘనత శేష్​కే దక్కింది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్టుగా శేష్ సినిమాలు చేస్తున్నాడు. చిన్న హీరోగా టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన శేష్.. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవల మేజర్ మూవీతో పాన్ ఇండియా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు.

Adivi Sesh
Adivi Sesh

మొదటి సినిమా నుంచి శేష్​కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కంటెంట్ ఉన్న మూవీస్​కే శేష్ సై అంటాడనే పేరుంది. అందుకే ప్రేక్షకులు శేష్ సినిమా వస్తుందంటే చాలు ఫుల్ ఖుష్ అయిపోతారు. తప్పకుండా ఈ హీరో సినిమా థియేటర్​కు వెళ్లి చూస్తారు. ఏ బ్యాక్​గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శేష్ అంటే అమ్మాయిలకూ చాలా ఇష్టం. ఫ్యాన్ ఫాలోయింగ్​లో శేష్ స్టార్ హీరోల కంటే కాస్త ముందడుగేశాడనే చెప్పాలి. ముఖ్యంగా లేడీస్ ఫాలోయింగ్​లో ఏ యంగ్ హీరోకు దక్కని క్రేజ్ శేష్​కు ఉంది.

HIT 2

ప్రస్తుతం హిట్ -2 మూవీ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నాడు శేష్. ప్రమోషన్స్, సక్సెస్ పార్టీలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో శేష్ హవా మామూలుగా లేదు. అమ్మాయిలైతే ఈ మూవీలో శేష్ క్యారెక్టర్​ను, యాక్టింగ్​ను తెగ పొగిడేస్తున్నారు. కొందరైతే సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రపోజ్ కూడా చేసేస్తున్నారు. ఓ అమ్మాయితే శేష్​ని ఏకంగా డేట్​కి వెళ్దామా అని అడిగేసింది.

- Advertisement -

ఆ అమ్మాయికి శేష్ ఇచ్చిన రిప్లై చూసి ఆమెతో పాటు మిగతా అమ్మాయిలు కూడా ఫిదా అయ్యారు. ఇంతకీ శేష్ ఏం అన్నాడంటే.. “శేష్ మనం డేట్​కి ఎప్పుడు వెళ్దాం” అని ఓ అమ్మాయి శేష్​కి సోషల్ మీడియా వేదికగా మెసేజ్ చేసింది. దానికి శేష్ రియాక్ట్ అవుతూ..” ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా.. మనం ఇద్దరం కలిసి హిట్-2 మూవీ చూసేద్దామంటూ అని రిప్లై ఇచ్చాడు. శేష్ కొంటె రిప్లైకి సోషల్ మీడియా నెటిజన్లు ఫిదా అయ్యాయి.

మరో నెటిజ‌న్ .. “హిట్ యూనివ‌ర్స్‌లోకి మ‌హేశ్ బాబు ఎంట్రీ ఇస్తే నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లిపోతుంద‌ని అన్నాడు. ఓ మంచి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ లైన్ రాసి మ‌హేశ్​ అన్న‌తో చేయండ‌న్న‌.. అది నా కోరిక అని చెప్పాడు”. దానికి వెంట‌నే శేష్ స్పందిస్తూ.. “ఈ రోజు ఉద‌య‌మే ఆయ‌న ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు. నా విష‌యంలో ఆయ‌న గ‌ర్వంగా ఫీల‌వుతున్నాన‌ని చెప్పారు. ఆ వెంట‌నే నా క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయ‌ని” శేష్ చెప్పాడు.

మహేశ్​ బాబు ఎప్పుడు నా బ్రదర్​లా వెన్నంటే ఉంటాన‌ని చెప్పార‌ని.. ఆయ‌న‌కు హిట్ 2 సినిమా ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నాన‌ని శేష్ అన్నారు. ఇక అడివి శేష్ తోమహేశ్​కు ప్రత్యేక అనుబంధం ఉంది. గూఢ‌చారి సినిమా ట్రైల‌ర్‌తో మెస్మ‌రైజ్ అయిన మ‌హేశ్.. శేష్ హీరోగా మేజ‌ర్ సినిమాను నిర్మించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here