Meenakshi Chaudhary : హిట్​-2 సక్సెస్​ జోష్​లో మీనాక్షి చౌదరి.. మత్తెక్కించే పోజులతో ఫొటోషూట్



మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) మోడల్ నుంచి నటిగా మారిన ఈ బ్యూటీ సుశాంత్ సరసన ఇచట వాహనములు నిలపరాదు అనే మూవీతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్​డ్ టాక్ సొంతం చేసుకుంది. ఓటీటీ రిలీజ్ వల్ల ఈ బ్యూటీ గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు. అయినా ఈ భామకు మాత్రం ఆఫర్లకు కొదువేం రాలేదు. రీసెంట్​గా క్రైమ్ థ్రిల్లర్ హిట్-2లో నటించి బ్లాక్​బస్టర్ హిట్ అందుకుంది.

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

మీనాక్షి ప్రస్తుతం హిట్-2 విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. అడివి శేష్ ప్రదాన పాత్రలో నటించిన హిట్ 2 మూవీకి ప్రేక్షకుల నుంచి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇప్పటికే నందమూరి నట సింహం కూడా ఈ సినిమా చూసి బాగుందని చిత్ర యూనిట్‌ను అభినందించారు. మరోవైపు ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Meenakshi Chaudhary Photos

ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లోకి ఎంటరైంది. అడివి శేష్ కెరీర్​లో మరో హిట్ మూవీ చేరినట్టే. ఇక ఈ సినిమాతో మీనాక్షికి కూడా టాలీవుడ్​లో లైన్ క్లియర్ అయినట్టే. ఈ సినిమా అందించిన సక్సెస్​ జోష్​లో మీనాక్షికి కూడా వరుస ఆఫర్లు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Meenakshi Chaudhary Saree Photos

హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫొటో షూట్స్‌తో అదరగొట్టింది. ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ.. 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Meenakshi Chaudhary Saree Stills

తెలుగులో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన ‘ఖిలాడి’లో కనిపించింది. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎట్టకేలకు హిట్2 మూవీతో ఈ బ్యూటీ కెరీర్ కాస్త ట్రాక్​లో పడింది.

Tags: