Malaika Arora : నా ఎక్స్, నేను, నా బాయ్​ఫ్రెండ్.. మధ్యలో మీకేంటి..? నెటిజన్లపై మలైకా ఫైర్

- Advertisement -

సాధారణంగా ప్రేక్షకులను అలరించాలంటే.. ఫన్​తో పాటు కాస్త రియాలిటీ ఉండాలి. ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాలు, సిరీస్​లు, ప్రోగ్రామ్స్ మాత్రమే హిట్ అవుతాయి. ముఖ్యంగా రియాల్టీ షోస్, టాక్ షోస్ హిట్ అవ్వాలంటే కాస్త మసాలాతో పాటు రియాల్టీకి దగ్గరగా ఉండాలి. రీసెంట్​గా డిస్నీ ప్లస్ హాట్​స్టార్​ బాలీవుడ్ దివా మలైకా ఆరోరా Malaika Arora తో ఓ షో ప్లాన్ చేసింది.

Malaika Arora
Malaika Arora

సాధారణంగానే ప్రేక్షకులకు సెలబ్రిటీల జీవితాల్లో కాంట్రవర్సీలంటే ఇంట్రెస్ట్. ఇక ఆ కాంట్రవర్సీలతో ఓ షో ప్లాన్ చేస్తే ఆ షో టీఆర్పీలు రికార్డులు బద్ధలు కావడం ఖాయం. ఇలాంటి షోని ప్రస్తుతం డిస్నప్లస్ హాట్​స్టార్ ప్లాన్ చేసింది. మూవింగ్ ఇన్ విత్ మలైకా పేరుతో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరాతో ఓ షో క్రియేట్ చేసింది. డిసెంబర్ 5 నుంచి ఈ షో హాట్​స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ కాబోతోంది. 

మలైకా అరోరా.. స్టార్​డమ్ ఉన్న హీరోయిన్​ కాదు.. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా కాదు. అడపాదడపా ఐటెమ్ సాంగ్స్​ చేసింది. అయినా కూడా ఈ బోల్డ్ బ్యూటీకి మామూలు క్రేజ్ ఉండదు. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు స్ట్రాంగ్ పోటీనిస్తూ ఫిట్​నెస్ మెయింటైన్ చేస్తోంది మలైకా. ఈ బ్యూటీ ఫిజిక్​కు మతిపోని కుర్రాడుండడు. ఇక సోషల్ మీడియాలో ఈ భామ గ్లామర్ షోకు అడ్డూ అదుపూ లేదు.

- Advertisement -

50 ఏళ్ల వయసులోనూ మలైకా తన అందాల విందుతో యువకులను కట్టిపడేస్తోంది. ఈ బ్యూటీకి తన బాయ్​ఫ్రెండ్​ అర్జున్​ కపూర్ చేస్తున్న డేటింగ్ విషయం ఎప్పుడూ వివాదాస్పదమే. చాలా మందికి ఈ జంట అంటే నచ్చదు. కుర్రాడితో రొమాన్స్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో మామూలుగా ట్రోలింగ్ జరగట్లేదు. అయినా సరే మలైకా తన మనసు చెప్పిందే చేస్తోంది. మూవింగ్ ఇన్ విత్ మలైకా షోలో ఈ బ్యూటీ తన లైఫ్​లో జరిగిన చాలా విషయాలు షేర్ చేసుకుందట.

“నేను బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను కాదు మోస్ట్ లవబుల్ స్టార్ అంతకన్నా కాదు.. ఇక యూత్ ఐకాన్ అన్న మాట నాకు అస్సలు సెట్ కాదు” అంటూ తన మీద తానే సెటైర్స్ వేసుకుంటోంది. దాదాపు పాతికేళ్లుగా ఈ గ్లామర్ ప్రపంచంలో ఈదులాడుతున్నా.. బాలీవుడ్‌లో మాత్రం పెద్దగా బిజీ కాలేకపోయింది మలైకా అరోరా. కెరీర్‌ స్టార్టింగ్ నుంచి హీరోయిన్‌ రోల్స్‌ వైపు చూడకుండా ఐటమ్ సాంగ్స్‌, గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ నెమ్మదిగా అవి కూడా తగ్గించేసింది. ప్రస్తుతం బుల్లి తెరలో, ఓటీటీలలో షోస్ చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. డ్యాన్స్‌ రియాలిటీ షోస్‌లో జడ్జ్‌గా పాల్గొంటున్న ఈ భామ సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌.

తాజాగా తన రాబోయే రియాలిటీ షో మూవింగ్ ఇన్ విత్ మలైకా కోసం సిద్ధమవుతున్న మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ క్లిప్‌లో, మలైకా తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడిపోవడం గురించి మాట్లాడింది. తన ఎక్స్, ప్రజెంట్ బాయ్​ఫ్రెండ్ గురించి విషయాలు చెప్పింది. డైరెక్టర్/కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌తో తన జీవితంలో తీసుకున్న డెసిషన్స్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. తను జీవితంలో తీసుకున్న ప్రతి డెసిషన్ ఆనందం కలిగించిందని చెప్పింది మలైకా. లైఫ్​లో తాను మూవ్ ఆన్ అయ్యానని.. తనలాగే తన ఎక్స్ కూడా మూవ్ ఆన్ అయ్యాడని.. మీరంతా ఎప్పుడు మూవ్ ఆన్ అవుతారని నెటిజన్లను ఉద్దేశించి అంది. ఈ ఎపిసోడ్ బాగా క్లిక్ అవుతుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భావిస్తోంది. ఈ షోలో తన బాయ్​ఫ్రెండ్ మేటర్ హాట్ టాపిక్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here