RC 17 : ఆర్ సి 17 కి రంగస్థలం స్టోరీ కి లింక్ ఏంటి..?

- Advertisement -

RC 17 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనని మించిన హీరో ఇంకెవరూ లేరు అనే విధంగా గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు హిట్ అవడం కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతాలను క్రియేట్ చేస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు రామ్ చరణ్. త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ దానితో పాటుగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ఆర్సి 17 కింద సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టే ఆలోచనలు రామ్ చరణ్ ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నారు ఇప్పుడు ఆ సినిమా పూర్తయ్యాక రామ్ చరణ్ తో కలిపి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రంగస్థలంకి సీక్వెల్ గా వస్తుందా లేకపోతే ఫ్రెష్ స్టోరీ తో వస్తుందా అనే వార్తలు కూడా వస్తున్నాయి.

- Advertisement -

రంగస్థలం సినిమాని కూడా చివర్లో ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు. కనుక ఆ సినిమాకి కనెక్ట్ చేస్తూ ఈ సినిమాలో ఏదైనా స్క్రిప్ ని చేసే అవకాశాలు ఉన్నాయా లేకపోతే సపరేట్ స్టోరీ తో వస్తారా అనేది అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాకి సంబంధించి పూర్తి అప్డేట్ తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. రామ్ చరణ్ సుకుమార్ రంగస్థలం సినిమాతో మ్యాజిక్ ని క్రియేట్ చేశారు ఇప్పుడు ఒకవేళ కనుక ఈ స్టోరీ కి లింక్ ఉన్నట్లయితే అభిమానులు కచ్చితంగా ఫుల్ ఖుషి అయిపోతారు. మరి ఆర్సి 17 కి సంబంధించి వివరాలు తెలిసే వరకు అభిమానులు ఎదురు చూడక తప్పదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here