Kannappa కన్నప్ప సినిమాలో నటించనున్న స్టార్ హీరో..!

- Advertisement -

Kannappa మోహన్ బాబు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు మోహన్ బాబు అప్పట్లో చేసిన ప్రతి సినిమా కూడా మంచి హిట్ ని అందుకుంది. ఒకప్పుడు మోహన్ బాబు మంచి నటుడిగా పేరుని సంపాదించుకున్నారు కానీ మధ్య లో ఆయన కొంతమంది హీరోలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం తన గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడం ఇటువంటి కారణాల వలన ఆయన మీద నెగటివ్ ప్రభావం పడింది. మోహన్ బాబుని కాకుండా ఈ విషయంపై ఫ్యామిలీ ని కూడా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉండగా మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. విష్ణు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది ఇప్పటిదాకా ఒకటి కూడా సరైన సక్సెస్ ని కొట్టలేదు. కాబట్టి ఇప్పుడు చేయబోయే సినిమాతో సరైన హిట్ కొట్టాలని తనని తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అయితే దానిలో భాగంగా ఆయన చేస్తున్న భక్త కన్నప్ప సినిమాలో స్టార్ హీరోలు చేరుతున్నారు ప్రభాస్, మోహన్లాల్, మధుబాల వంటి స్టార్స్ ఈ సినిమాలో ఉన్నారు.

- Advertisement -

అయితే ఈ సినిమాలో ఇంకో స్టార్ హీరో కూడా వచ్చి చేరతారని వార్తలు వస్తున్నాయి ఆయన ఎవరు అంటే తమిళ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగులో కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అది పినిశెట్టి. ఇప్పుడు భక్త కన్నప్ప సినిమాలో తను కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి విష్ణు ఈ సినిమాతో సరైన సక్సెస్ ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అందుకోసమే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అని కూడా తెలుస్తోంది మరి భక్తకన్నప్ప మంచు విష్ణు కి సక్సెస్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here