ఆ పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ కి ఛాన్స్..!

- Advertisement -

స్టార్లు పిల్లలు కూడా ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యం అంటూ ఫేమస్ అయిపోతున్నారు సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం సర్వసాధనంగా చూస్తూ ఉంటాం. ఇప్పటికే ఎంతో మంది సినీ వారసులు వారసురాలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. సీనియర్ దివంగత నటుడు అల్లు రామలింగా వారసుడిగా అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగించారు. అల్లు అరవింద్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగించారు. ఈయన వారసుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంటూ అల్లు అర్జున్ తన కూతురు అర్హ ని కూడా ఇండస్ట్రీలోకి బాలనాటిగా తీసుకువచ్చారు.

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం మూవీ ద్వారా బాల నటిగా మారింది అల్లు అర్హ. ఈమె తన నటన తో ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. అర్హ చిన్న వయసు లోనే ఎంతోమంది ఫాన్స్ ని కూడా సంపాదించుకుంది. బాల నటిగా ఇండస్ట్రీలోకి రాకముందే ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఒక సినిమాలో నటించి తన నటనతో అందరినీ మెప్పించిన అర్హ కి అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఈమె మరో పాన్ ఇండియా మూవీలో నటించబోతుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా జాహ్నవి కపూర్ హీరోయిన్ గా వస్తున్న దేవర సినిమాల్లో అల్లు అర్హ నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో నటి జాన్వి కపూర్ చిన్నప్పటి పాత్రలో అర్హ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాలో అల్లు అర్జున్ కూతురు నటించబోతుందని విషయం తెలియడంతో అభిమానులు సంతోష పడుతున్నారు. అర్హ గురించి వస్తున్నటువంటి ఈ వార్తల్లో ఎంత దాకా నిజమనేది తెలియదు ఎన్టీఆర్ అల్లుఅర్జున్ మధ్య చాలా అనుబంధం ఉన్న నేపథ్యంలో అర్హ ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్ కూడా ఒప్పుకున్నారని తెలిసి అభిమానులు సంతోషపడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here