‘కెరటం’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్ . ఆ సినిమాలో తన అందం, నటనతో ఆకట్టుకున్న రకుల్ ఆ తర్వాత వరుస అవకాశాలతో తెలుగు తెరపై దూసుకెళ్లింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, పండగచేస్కో వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ప్రస్తుతం టాలీవుడ్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన రకుల్.. కోలీవుడ్, బాలీవుడ్ లో చాలా బిజీ అయిపోయింది. బీ టౌన్ లో ఛత్రివాలి, డాక్టర్ జీ, థాంక్ యూ వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బీ టౌన్ లో రకుల్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో నటిస్తోంది. ఛత్రివాలి సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ఈ మూవీ జనవరి 20న జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
బాలీవుడ్ కు వెళ్లాక రకుల్ చాలా సన్నగా మారిపోయింది. ఫిట్ నెస్ పై చాలా ఫోకస్ పెట్టే రకుల్ ఇలా సన్నబడటమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముద్దుగా ఉండే రకుల్ బాగుండేదని.. ఇలా సన్నబడిన రకుల్ తమకు నచ్చడం లేదని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా రకుల్ బ్లాక్ డ్రెస్ లో సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఈ అమ్మడు మరీ సన్నగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.
మరోవైపు ప్రస్తుతం రకుల్ కెరీర్ ఏమీ బాగాలేదని బీ టౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ మూడు సినిమాల తర్వాత రకుల్ కు అవకాశాలు లేవని అంటున్నారు. అందుకే ఈ అమ్మడు పారితోషికం కూడా తగ్గించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఒకప్పుడు హీరోయిన్‌గా నటించడానికి రకుల్ ఒక్కో సినిమాకు కోటి 50 లక్షల వరకు అందుకుందట. ప్రస్తుతం డైలీ పేమెంట్స్ విధానంలో భాగంగా.. రోజుకు మూడు లక్షలు వరకు తీసుకుంటుందని టాక్. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. రకుల్ ప్రస్తుతం తెలుగులో ఎలాంటీ సినిమాలు చేయడం లేదు.