Rakul Preet : అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో.. మతిపోగొట్టే పోజులతో నెట్టింట రకుల్ రచ్చ



కెరటం మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన Rakul Preet అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరటంలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో దూసుకెళ్తోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు దాదాపు అందరితోనూ ఈ బ్యూటీ నటించింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

Rakul preet

ఇక టాలీవుడ్‌ను ఓ రేంజ్‌లో ఆటాడేసుకున్న రకుల్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. అందుకోసం తన మకాంని కూడా అక్కడికే మార్చేసింది. బీ టౌన్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ముంబయి ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్‌లో డాక్టర్ జీ, ఛత్రివాలి అనే సినిమాలు చేస్తోంది. రీసెంట్‌గా థాంక్ గాడ్, కట్‌పుత్లీ సినిమాలతో బీ టౌన్‌లో సందడి చేసిందీ భామ.

Rakul Preet Pictures

రకుల్ లేటెస్ట్ మూవీ ఛత్రివాలీ డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని టాక్. ఈ మూవీలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో జనవరి 20న స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Rakul Preet photos
Rakul preet

సినిమాలతో బిజీ బిజీగా ఉండే రకుల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా రకుల్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పర్పల్ కలర్ డ్రెస్‌లో రకుల్ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఫిట్‌నెస్‌లో రకుల్‌కు ఎవరూ సాటి రారంటూ కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ గ్లామర్ చూసి కుర్రాళ్లు మతి చెడిపోతున్నారు.

rakul preet

ప్రస్తుతం రకుల్ సరైన అవకాశాలు లేక తన రెమ్యునరేషన్ కూడా కాస్త తగ్గిస్తోందట. డైలీ పేమెంట్స్ విధానంలోకి వచ్చిందట. ఒకప్పుడు హీరోయిన్‌గా నటించడానికి ఆమె ఒక్కో సినిమాకు కోటి 50 లక్షల వరకు అందుకుంది. కానీ ప్రస్తుతం డైలీ పేమెంట్స్ విధానంలో రోజుకు మూడు లక్షల వరకు తీసుకుంటోందట. ప్రస్తుతం రకుల్‌ ఓ తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తోంది. రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది.