Walthair Veerayya : మేం ఆ టైప్ కాదు.. ఏమో.. చరణ్ ఫస్ట్ బాలయ్య సినిమానే చూస్తాడేమో : చిరంజీవి

- Advertisement -

Walthair Veerayya : సంక్రాతి సందడి మొదలైంది. ఇవాళ వీరసింహా రెడ్డి సినిమా తో నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి బరిలో దిగుతున్నారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య గా రేపు థియేటర్ లో సందడి చేయనున్నారు. సంక్రాతి బరిలో ఇద్దరు అగ్ర నేతలు పోటీ పడుతుండటం తో ఫ్యాన్స్ తమ తమ ఫేవరేట్ హీరో గురించి సోషల్ మీడియా లో తెగ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంకో హీరోపై నెగిటివ్ ప్రచారం కామెంట్స్ చేస్తున్నారు.

Waltair veerayya
Waltair veerayya

వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న చిరంజీవి.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ రచ్చపై స్పందించారు. ఇప్పటికే రెండుగా విడిపోయిన ఇద్దరు హీరోల అభిమానులు.. సినిమాల గురించి నెగిటివ్, పాజిటివ్‌గా ప్రచారం చేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. దాంతో రిలీజ్ టైమ్‌కి ఈ ధోరణి సోషల్ మీడియాలో మరింత పెరిగే ప్రమాదం ఉంది.

దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. ‘మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఒకరి సినిమా పోవాలి.. మరొకరి సినిమా ఆడాలి అని కోరుకోదు. అసలు మేము ఆ టైపే కాదు. అలా ఆలోచించడం మా రక్తంలోనే లేదు’ అని అన్నారు. అలానే ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్‌తో ఫోన్‌లో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ ఫస్ట్ ‘వీరసింహా రెడ్డి’ మూవీని చూసి ఆ తర్వాత వాల్తేరు వీరయ్యని చూడాలని సూచించారు. దానికి రామ్ చరణ్ కూడా ‘తప్పకుండా సార్’ అని సమాధానమిచ్చాడు. ఆ విషయాన్ని ప్రస్తావించిన చిరంజీవి.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రామ్ చరణ్.. తొలుత వీరసింహా రెడ్డి మూవీనే చూస్తాడేమో? అని సరదాగా చెప్పుకొచ్చారు.

- Advertisement -
Ravi Teja
Ravi Teja

కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ వేదికగా జరిగిన ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్ పంక్షన్‌కి ఉపాసనతో కలిసి రామ్ చరణ్ హాజరైన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి రామ్ చరణ్ కూడా సతీసమేతంగా అక్కడికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో రెండు సినిమాలనూ అక్కడే రామ్ చరణ్ చూసే అవకాశం ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here