Walthair Veeraya : మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ వాల్తేరు వీరయ్య.సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా అభిమానులు, ప్రేక్షకుల్లో పూనకాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీతో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో వాల్తేరు వీరయ్యగా చిరు సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ.114.13 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించగా 11వ రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ సారి చూసేద్దాం..
ఏపీ, తెలంగాణలో కలుపుకుని నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 10.2 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 6 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ. 7.50 కోట్లు, కృష్ణా రూ. 5.6 కోట్లు, నెల్లూరు రూ. 3.2 కోట్లతో రూ. 72 కోట్లు వాల్తేరు వీరయ్యకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే కర్ణాటకలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 9 కోట్లతో మొత్తంగా రూ. 88 కోట్లు నమోదు అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదు అయింది.
ఇక హైదరాబాద్ లో హైదరాబాద్‌లో 47.67 శాతం, బెంగళూరులో 42 శాతం, చెన్నైలో 71.33 శాతం, విజయవాడలో 47 శాతం, వరంగల్‌లో 45.33 శాతం, గుంటూరులో 53.33 శాతం, వైజాగ్‌లో 69 శాతం, నిజమాబాద్‌లో 11.67 శాతం, కరీంనగర్‌లో 69 శాతం, కాకినాడలో 68.67 శాతం, నెల్లూరులో 80 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.పదో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా 10వ రోజు రూ. 9 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. అయితే 11వ రోజు సోమవారం కావడంతో కలెక్షన్లు కాస్తా తగ్గినట్లు తెలుస్తోంది. వింటేజ్ లుక్ లో చిరంజీవి అదరగొట్టిన వాల్తేరు వీరయ్య సినిమా 11వ రోజు రూ. 4.35 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే 200 కోట్ల క్లబ్ లోకి చేరింది..ఇప్పటిలో కొత్త సినిమాలు లేకపోవడం కలెక్షన్ లు పెరిగే అవకాశం ఉంది..