Waltair Veerayya : వంద కోట్ల క్లబ్​లో ‘వాల్తేరు వీరయ్య’

- Advertisement -

Waltair Veerayya : మెగాస్టార్​ చిరంజీవి, మాస్​ మహారాజా రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్​ ముందు దూసుకెళ్తోంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఎట్టకేలకు చిరు వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఇప్పటికీ ధమాకా తో 100 కోట్ల హీరో అయిన రవితేజ వాల్తేరు వీరయ్యతో మరో 100 కోట్ల సినిమా ను తన ఖాతాలో వేసుకున్నాడు

Waltair Veerayya
Waltair Veerayya

సూపర్ హిట్ టాక్​ను అందుకున్న ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి వసూళ్లను అందుకుంటోంది. మొత్తంగా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.108కోట్ల గ్రాస్​ను అందుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

చిరంజీవి-రవితేజ అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యాక్షన్, డ్యాన్స్​లు సహా బ్రదర్ సెంటిమెంట్ ఎలిమెంట్స్‌ ఆడియెన్స్‌ను ఊర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా చిరు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌ను విపరీతంగా అలరిస్తున్నాయి. చిరు డ్యాన్స్​లు, నటన చూసిన వారందరూ వింటేజ్ చిరంజీవిని చూసినట్లు ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ సినిమా వీపరీతంగా అలరిస్తోంది. ప్రకాష్ రాజ్, బాబీ సింహ కీలక పాత్రల్లో నటించారు. శ్రుతి హాసన్, కేథరిన్​ హీరోయిన్స్​గా కనిపించారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో సాగే సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here