Prabhas : ప్రభాస్ ను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్న వివేక్ అగ్నిహోత్రి..

- Advertisement -

Prabhas : బాహుబలి మూవీతో మోస్ట్ వాంటెడ్ హీరో గా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ సెన్సేషన్ను సృష్టించడంతో పాటు ప్రభాస్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ప్రభాస్ వరుసగా పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఊహించిన రేంజ్ హిట్ అయితే ఇంతవరకు రాలేదు.రీసెంట్ గా విడుదలైన ఆది పురుష్ చిత్రం పలు వివాదాలలో చిక్కుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది.

Prabhas
Prabhas

ఈ నేపథ్యంలో ప్రభాస్ రాబోతున్న చిత్రాలపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకొని ఉన్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ఈ మూవీ గురించి ఇటీవల విడుదలైన టీజర్ మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడమే కాకుండా చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది.

ఈ టీజర్ లో ప్రభాస్ క్యారెక్టర్ ను ‘ది మోస్ట్ వయొలెన్స్ మ్యాన్’గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రపంచమంతా ఎంతో బాగుంది అని మెచ్చుకుంటున్న ఈ టీజర్ పై ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ కేవలం లవ్ సౌండ్ తో కూడిన ఒక నాన్సెన్స్ యాక్షన్ అని వివేక్ అగ్నిహోత్రి విమర్శించారు. అంతేకాకుండా ప్రభాస్ పేరు వాడకుండా ఇన్ డైరెక్ట్ గా అతని గురించి సెటైర్లు ట్వీట్ చేశారు.ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

- Advertisement -

ఇంతకీ అతని ట్వీట్ లో ఏముందంటే.. “ఎవ్వరూ పుట్టుకతోనే హింసాత్మకంగా ఉండరు…మీ పిల్లల మైండ్ ని శాంతి వైపు ప్రేరేపించాల్సిన ఇండస్ట్రీ ప్రముఖులు.. సాహిత్యం మరియు సినీ రాజకీయాలలోని హింసను గ్లామరైస్ చేయడం ద్వారా మార్చేస్తున్నారు. ఇలాంటి హింసాత్మక ప్రపంచానికి పరిష్కారం సృజనాత్మకత స్పృహ మాత్రమే”అని ఉంది. ఇంతకుముందు ఆది పురుష్ చిత్రం గురించి కూడా ప్రభాస్ తాగుబోతు అని అర్థం వచ్చేలా వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ పెట్టారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ పై ఎందుకు అతనికి అంత ప్రత్యేకమైన కక్ష అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది.గత సంవత్సరం ప్రభాస్ ‘రాధేశ్యామ్’రిలీజ్ జరిగిన మార్చి 11 రోజుని వివేక్ దికాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని విడుదల చేశాడు. మళ్లీ ఇప్పుడు తిరిగి అదే రకంగా ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రం విడుదల అవుతున్న సెప్టెంబర్ 28వ తేదీన ‘ది వాక్సిన్ వార్’అనే మరొక చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది కేవలం ప్రభాస్ సినిమాకు వచ్చే నెగటివ్ టెక్నిక్ క్యాష్ చేసుకోవడానికి అని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here