ప్రభాస్ జాతకం ప్రకారం ఆదిపురుష్ సినిమా హిట్టా.. ఫట్టా? పెళ్ళి ఎప్పుడంటే.. ??

- Advertisement -

పాన్ ఇండియా స్టార్.. రెబల్ స్టార్.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్ కానీ.. సినీ ప్రేక్షకులు గానీ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు హల్క్ లా ఉండే ప్రభాస్ సౌమ్యుడైన రాముడి పాత్రలో ఎలా ఉంటాడోనని చాలా మంది అనుమానపడ్డారు. సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్ వస్తోంటే ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. కానీ ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశాక ఆ అంచనాలన్నీ పేక మేడల్లా కూలిపోయాయి. ఈ చిత్రం గ్రాఫిక్స్ మీద మామూలు ట్రోలింగ్ జరగలేదు. ప్రభాస్ కూడా డైరెక్టర్ ఓం రౌత్పై తెగ ఫైర్ అయ్యాడు. అప్పటి నుంచి ఆదిపురుష్పై అంచనాలు తప్పాయి. ఈ సినిమా ఎలాగూ ఫ్లాప్ అవుతుందని అందరూ భావించారు.

ప్రభాస్
ప్రభాస్

కానీ ఇటీవల ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున, 70 దేశాల్లో రిలీజ్ చేశారు. గతంలో వీఎఫ్ఎక్స్ ఫీడ్ బ్యాక్ను దృష్టిలో పెట్టుకొని, ట్రైలర్ను జాగ్రత్తగా కట్ చేసినట్టు కనిపించింది. మరీ ముఖ్యంగా టీజర్-ట్రైలర్ మధ్య తేడాను గమనిస్తే.. గ్రాఫిక్స్లో భారీ మార్పులు కనిపించాయి. టీజర్తో పోలిస్తే.. ఈ తాజా ప్రచార చిత్రంలోని గ్రాఫిక్స్ చాలా బాగున్నాయనే చెప్పాలి. అభిమానులు దీన్ని పండగ చేసుకుంటున్నారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆదిపురుష్పై ప్రేక్షకుల అంచనాలు మళ్లీ ఊపిరిపోసుకున్నాయి. సినిమా బాక్సాఫీస్ను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు.

prabhas

అయితే బాహుబలి తర్వాత హిట్ లేక సతమతమవుతున్న ప్రభాస్కు ఆదిపురుష్ ఊరట కలిగిస్తుందా. సాహో, రాధే శ్యామ్తో భారీ ఫ్లాపులు మూటగట్టుకున్న ప్రభాస్ను ఈ సినిమా ఆదుకుంటుందా..? రాముడి సెంటిమెంట్తో వస్తున్న ఈ పాన్ ఇండియా స్టార్కు ప్రేక్షకులు మళ్లీ పట్టం కడతారా..? అసలు ఆదిపురుష్ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందా..? ఆదిపురుష్ మూవీ హిట్టా.. ఫట్టా..? ప్రభాస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనే విషయాలను ప్రముఖ జ్యోతిష్యులు నానాజీ పట్నాయక్ చెప్పారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..?

- Advertisement -

ప్రభాస్కు ప్రస్తుతం కేతుమహర్దశ నడుస్తోందని జ్యోతిష్యులు చెప్పారు. ‘కేతు మహర్దశ స్టార్ అయిన తర్వాతే సాహో, రాధేశ్యామ్ రిలీజ్ అయ్యాయి. అందుకే అవి ఫ్లాప్ అయ్యాయి. ఈ దశ 2025 వరకు ఉంటుంది. అయితే కేతు మహర్దశలో ప్రస్తుతం గురువు ఉండటం అది కూడా 9వ పాదంలో ఉన్నారు. కేతువు ఆధ్యాత్మికతకు కారణం అందుకే ఆదిపురుష్ పక్కా హిట్ అవుతుంది. 2025 నవంబర్ వరకు ఆధ్యాత్మికతకు సంబంధించిన సినిమాలకు మంచి టాక్ వస్తుంది.’ అని జ్యోతిష్యులు నానాజీ పట్నాయక్ చెప్పారు. అంతేకాదు కేతుదశ అయిపోగానే ప్రభాస్కు పెళ్లి కూడా జరుగుతుందని ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here