‘భోళా శంకర్’ ట్రైలర్ రివ్యూ.. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ తో మెగాస్టార్ అదిరిపోయే రేంజ్ డైలాగ్స్!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ మూవీ వచ్చే నెల 11 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పాటలు ఇప్పటికే భారీ హిట్ అయ్యాయి. అప్పట్లో విడుదల చేసిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెహర్ రమేష్ నుండి ఇలాంటి ప్రోడక్ట్ వస్తుందని ఫ్యాన్స్ ఊహించలేకపోయారు.

భోళా శంకర్' ట్రైలర్
భోళా శంకర్’ ట్రైలర్

అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బలంగా జరిగింది. ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ అనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఇక్కడ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఆయన అభిమానులకు పూనకాలు రప్పించే విధంగా ఈ సినిమాని తీర్చి దిద్దాడని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. దీనికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే వేదలమ్ చిత్రం లోని ఒక ఫైట్ సన్నివేశం ఎంత క్లిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ మీమెర్స్ ఈ సన్నివేశాన్ని వాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. అయితే ఈ సన్నివేశాన్ని జిరాక్స్ కాపీ దింపినట్టు ‘భోళా శంకర్’ లో దింపారని ట్రైలర్ ని చూస్తే అర్థం అయిపోతుంది.

- Advertisement -

అంతే కాకుండా తమన్నా చేత రామ్ చరణ్ ‘రంగస్థలం’ రిఫరెన్స్ చెప్పించడం, అలాగే ట్రైలర్ చివర్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ ని ఇమిటేషన్ చెయ్యడం వంటివి మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్ ని ఇచ్చింది. కానీ తమన్నా తో రొమాంటిక్ సాంగ్ ని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here