Vishnu Priya : వైరలవుతున్న విష్ణుప్రియ లేటెస్ట్ సాంగ్.. ఓవర్ ఎక్స్ పోజింగ్ అంటున్న నెటిజన్లు

- Advertisement -

VIshnu Priya : యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ విష్ణుప్రియ (vishnu priya). బుల్లితెరపై పలు షోలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక టీవీ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మానస్. బిగ్ బాస్ షోలో పాల్గొని బాగా పాపులారిటీ సంపాదించాడు.

vishnu priya
vishnu priya

ఆ తర్వాత విష్ణుప్రియ, మానస్ కలిసి ‘జరీ జరీ పంచెకట్టి’ అనే ప్రైవేట్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఊరమాస్ స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. మాస్ బీట్, వెరైటీ స్టెప్పులతో కూడిన ఈ పాట యూట్యూబ్ ను ఓ ఊపు ఊపింది. ఇద్దరి స్టెప్పులు చూసి ప్రేక్షకులు వారెవ్వా అన్నారు. ఈ పాట, సినిమా పాటకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.

vishnu priya Manas
vishnu priya Manas

తాజాగా వీరిద్దరూ కలిసి ‘గంగులు’ పాటను చేశారు. మూడు రోజుల క్రితం విడుదలైన ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఎప్పటిలాగానే విష్ణుప్రియ తన అందాలతో కనువిందుగా డ్యాన్స్ చేసింది. ఇక మానస్ కూడా అదే రేంజ్ లో డ్యాన్స్ అరిపించేశాడు. గతంలో మాదరిగానే ఖర్చుకు వెనుకాడకుంగా గ్రాండ్ లుక్ వచ్చేలా ఈ పాటను తెరకెక్కించారు. అదిరిపోయే లిరిక్స్, అంతకు మించి స్టెప్పులతో ఈ పాట కూడా చార్ట్ బస్టర్ కాబోతుందనిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here