Navadeep : ‘రానా నాయుడు’లో అలాంటి సీన్లు ఉన్నాయి కాబట్టే నచ్చింది..నవదీప్

- Advertisement -

Navadeep : ఇటీవల విడుదలైన ‘రానా నాయుడు’లో ఏ సర్టిఫికేట్ సీన్లు ఎక్కువ ఉన్నాయని చాలా మంది అన్నారు. తాజాగా ఈ సిరీస్‌ గురించి నవదీప్‌ (Navdeep)ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సిరీస్‌ తనకెంతో నచ్చిందని తెలిపారు. అలాంటి సీన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే మా జనరేషన్ వాళ్లకు ఈ సిరీస్ నచ్చిందని అన్నారు. ఇంత ఓపెన్ గా ఎలా చెప్పారా అని అందరూ అనుకుంటున్నారు.

Navadeep
navadeep

‘‘రానా నాయుడు’ను ఎంజాయ్‌ చేసిన వాళ్లు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అలానే దీనిపై విమర్శలు కురిపించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ సిరీస్‌ పాత జనరేషన్‌ వాళ్లకు నచ్చపోవచ్చు.. కానీ నేటి తరానికి కచ్చితంగా నచ్చుతుంది. దీని గురించి ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా.. ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. ‘రానా నాయుడు’ నచ్చని వాళ్ల గురించి నేను మాట్లడాలనుకోవడం లేదు. ఈ సిరీస్‌ అంతా ముంబయిలో కల్చర్‌ ప్రధానాంశంగా సాగుతుంది. దాని గురించి తెలిసిన వారికి ఇది చాలా నచ్చుతుంది. ఆ కల్చర్‌ను ఇందులో చాలా సరదాగా చూపించారు. అయినా ఈ సిరీస్‌ను ఒంటరిగా చూడాలని వాళ్లు ముందే చెప్పారు’’ అని నవదీప్‌ అన్నారు.

rana naidu

వెంకటేష్, రానా అభిమానులు చూసి ఉంటారు. లేడీస్ (ladies) మాత్రం చూసే ధైర్యం చేయరు. పెద్ద వారి నుంచి కూడా వ్యతిరేకత రానుంది. విడుదలయిన వెంటనే నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయినప్పటికీ వెబ్ సిరీస్ మాత్రం ట్రెండింగ్‌లో ఉంది. దీని సెకండ్ సీజన్ కూడా ఉండే అవకాశం ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here