Vishnu Priya: కన్నీళ్లు పెట్టిస్తున్న విష్ణు ప్రియ.. ఎవ్వరికీ ఈ కష్టం రాకూడదు..

- Advertisement -

Vishnu Priya: పదహారణాల అచ్చ తెలుగు యాంకర్ విష్ణు ప్రియ గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.. ఈ భామకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.. పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయినా విష్ణు ప్రియ.. మోడలింగ్ ద్వారా టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. విష్ణుప్రియ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది.. కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ చేయలేదు. అందుకు కారణం.. ఇటీవల తన తల్లి చనిపోవడం.. మరోసారి తన తల్లిని గుర్తు చేసుకుంటూ విష్ణుప్రియ ఎమోషనల్ వీడియోలు షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Vishnu Priya emotional post on her mom birthday
Vishnu Priya emotional post on her mom birthday

నిన్న ఫిబ్రవరి 15న విష్ణు ప్రియ తల్లి పుట్టినరోజు ఈ సందర్భంగా తన తల్లిని గుర్తు చేసుకుంటూ తనతో గడిపిన మధుర క్షణాలన్నింటినీ కలిపి ఓ వీడియోగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది విష్ణు. విష్ణు ప్రియ కి తన తల్లి చీర కట్టడం, తనని ప్రేమగా ముద్దాడటం, తనకి మెలుకువలు చెప్పడం ఎన్నో ఆనందకరమైన సన్నివేశాలు ఈ వీడియోలో ఉన్నాయి..

తన తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేదు అంటూ.. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియోలు పంచుకుంది. నీ ప్రేమ, ఎనర్జీని ఎవరు భర్తీ చేయలేరు. నా డార్లింగ్, ఏంజెల్ వి నువ్వే.. ఇప్పటికీ , ఎప్పటికీ నిన్ను మిస్ అవుతాను .. లవ్ యు అమ్మ అని.. అమ్మపై తనకున్న ప్రేమను అక్షర రూపం ఇచ్చింది. దాంతోపాటు నా లైఫ్ లో ఆ ఒక్క మహారాణి మా అమ్మ మాత్రమే అని ఓ ఇంటర్వ్యూలో తను చెప్పిన మాటలను కూడా యాడ్ చేసింది..

- Advertisement -

ఈ ఏడాది జనవరి 26న విష్ణు ప్రియ తల్లి మరణించిన సంగతి తెలిసిందే. మై డియర్ అమ్మ ఈరోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు.. నీకు ధన్యవాదాలు. నేను చివరి శ్వాస విడిచే వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం నువ్వే నా బలహీనత.

ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు ప్రతి చోట నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అని ఆ సందర్భంలో విష్ణుప్రియ కన్నీరు పెట్టుకుంది. ఒకసారి నువ్వు తిరిగిరామ్మ.. ప్లీజ్ నాకోసం తిరిగి రమ్మని విష్ణుప్రియ భావోద్వేగానికి లోనయ్యారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here