‘విమానం’ మూవీ రివ్యూ..సెంటిమెంట్ తో ఏడిపించేసారుగా!

- Advertisement -

ఈ ఏడాది సమ్మర్ లో చిన్న సినిమాల జోరు మామూలుగా లేదు, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమాలు బోల్తా కొట్టి నిర్మాతలు మరియు బయ్యర్స్ కి నష్టాలను మిగల్చగా, చిన్న సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచి టాలీవుడ్ కి కాస్త ఊపిరి పోశాయి. రీసెంట్ గా అలా విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘విమానం’. సముద్ర ఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా నేడు గ్రాండ్ గా విడుదలైంది. విడుదలకు ముందు నుండే ప్రొమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ లో సముద్ర ఖని ఈ చిత్రం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. మరి ఆయన చెప్పినట్టుగా ఈ సినిమా ఉందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

విమానం' మూవీ రివ్యూ
విమానం’ మూవీ రివ్యూ

కథ :

అంగవైకల్యం మరియు పేదరికం సగటు మనిషికి ఎలాంటి నరకాన్ని ఇస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఆ బాధ వర్ణణాతీతం. అలా ఆ రెండింటితో బాధపడుతున్న వీరయ్య (సముద్ర ఖని) కి రాజు (మాస్టర్ ధృవన్) అనే కొడుకు ఉంటాడు. అతనికి చిన్నతనం నుండి విమానం అంటే పిచ్చి. ఇంట్లో ఆయన ఆదుకునే బొమ్మలన్నీ కూడా విమానాలే. ఒక్కసారైనా అందులో ఎక్కాలని కోరుకుంటాడు. కానీ సులభ్ కంప్లెక్స్ ని నడుపుకుంటూ డబ్బులు సంపాదించే వీరయ్య కి అంత స్తొమత ఉండదు, జీవనాధారం గా నిల్చిన సులభ్ కాంప్లెక్స్ ని కూడా కూల్చేస్తారు, ఎలా అయినా బిడ్డని విమానం ఎక్కించాలనే తపనతో చేతికి దొరికిన ప్రతీ పని చేసి డబ్బులను కూడగడుతాడు.

- Advertisement -

మరో పక్క ఆయనకీ ఆటో డ్రైవర్ (ధన రాజ్) మరియు చెప్పులు కొట్టుకునే వాడు (రాహుల్ రామకృష్ణ) తో స్నేహం ఉంటుంది. రాహుల్ రామకృష్ణ ఆ కాలనీ లో వేశ్య గా ప్రసిద్ధి గాంచిన సుమతి (అనసూయ భరద్వాజ్) ని ప్రేమిస్తాడు. అతని ప్రేమని సుమతి ఒప్పుకుంటుందా, వీరయ్య తన కొడుకుని విమానం ఎక్కించాడా వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్ర ఖని కెరీర్ లో మరో మచ్చుతునక లాంటి పాత్ర ఈ సినిమా ద్వారా దక్కింది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఆయన నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి. కొడుకు కోరికని తీర్చడానికి అహర్నిశలు కష్టపడే తండ్రి పాత్రలో సముద్ర ఖని నటన ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యి కంటతడి పెట్టెలాగా చేస్తుంది. ఇక ఆయనతో పోటీపడి మరీ నటించాడు, మాస్టర్ ధృవన్ అనే బుడ్డోడు.

వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు తండ్రీ కొడుకుల సంబంధానికి, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమకి అద్దం పట్టేలా ఉంటుంది. ఇక ప్రముఖ హీరోయిన్ మీరాజాస్మిన్ చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా మన తెలుగు ఆడియన్స్ ని మరోసారి పలకరించింది, కానీ ఆమెది కేవలం అతిథి పాత్ర మాత్రమే. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా అనిపించినా కథ లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యి చూసే విధంగా తీర్చి దిద్దాడు డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల.

సెకండ్ హాఫ్ మొత్తం ఆడియన్స్ కి ఒక కమర్షియల్ సినిమాని చూస్తున్న అనుభూతి కలిగించేందుకు సినిమాటిక్ లిబర్టీ ని ఫాలో అయ్యారు. ఇలాంటి సినిమాలకు సినిమాటిక్ లిబర్టీ పనికిరాదు, కానీ సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషన్ ని క్యారీ చెయ్యడం వల్ల ఆడియన్స్ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు మాత్రం డైరెక్టర్ ఏడిపించేసాడు. ఇక వేశ్య పాత్రలో నటించిన అనసూయ కి కూడా చాలా కాలం తర్వాత మంచి క్యారక్టర్ పడింది అని చెప్పొచ్చు.

ఈమెని ప్రేమించే క్రమంలో రాహుల్ రామకృష్ణ పడే పాట్లు ఆడియన్స్ కి నవ్వు రప్పిస్తుంది. వివేక్ కాలేవు సినిమాటోగ్రఫీ బాగుంది, చరణ్ అర్జున్ అందించిన మ్యూజిక్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో అనిపించింది. కమర్షియల్ గా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబడుతుందో ఇప్పుడే చెప్పలేము కానీ, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ని చూసిన అనుభూతి కలుగుతుంది థియేటర్స్ నుండి బయటకి వచ్చేటప్పుడు.

చివరి మాట :

కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక చక్కటి చిత్రం, చాలా సన్నివేశాలు మన మనసుకి హత్తుకుంటాయి.

నటీనటులు : సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ద్రువన్, మీరా జాస్మిన్, ధన్ రాజ్, రాహుల్ రామకృష్ణ
దర్శకుడు : శివ ప్రసాద్ యానాల
సినిమాటోగ్రఫీ : వివేక్ కాలేవు
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్ : చరణ్ అర్జున్

రేటింగ్ : 2.75/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here