Swetha Basu : చేతిలో మందు గ్లాసు.. మత్తెక్కించే అందాలతో రెచ్చిపోయిన ‘కొత్త బంగారు లోకం’ భామ

- Advertisement -

Swetha Basu : శ్వేతాబసు ప్రసాద్.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎ..క్క..డా.. అంటూ తెలుగు కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది ముద్దుగుమ్మ. చూడచక్కని అందం.. కలువ కన్నులతో వెండితెరపై తారలా మెరిసింది. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ చిన్నది. కొత్త బంగారు లోకం సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా నటించి అచ్చమైన తెలుగమ్మాయిగా జనాలకు దగ్గరైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మొదటి సినిమా ఘన విజయం సాధించడంతో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ సినిమా తర్వాత వచ్చిన రైడ్ సినిమాలో నటించి మెప్పించింది. ఆ సినిమా తర్వాత జూ.ఛార్మీగా జనాలు శ్వేతబసును పిలుచుకున్నారు.

Swetha Basu
Swetha Basu

కానీ, తర్వాత సరైన సినిమాలను సెలక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో అమ్మడి కెరీర్ ప్రమాదంలో పడింది. శ్వేత నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెల్లగా అమ్మడి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. అయినా ఆశించిన స్థాయిలో తనకు గుర్తింపు రాలేదు. దీంతో అటు సినిమా అవకాశాలు రావడమే కరువయ్యాయి. 2018లో తన ప్రియుడు రోహిత్ మిట్టల్ ను పెళ్లిచేసుకుంది. కానీ మనస్పర్థలతో వీరిద్దరు విడిపోయారు. విడాకుల తర్వాత శ్వేత ఒంటరిగానే ఉంటుంది. మధ్యలో కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో నిలిచింది.

- Advertisement -

వాటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఈబ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లకు షాకిస్తున్నాయి. ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్స్ లో ఎంతో క్యూట్ గా కనిపించిన ఇప్పుడు తన అందాల ఆరబోత చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పట్లో బొద్దుగా ఉన్న ఆ అమ్మడు.. ఇప్పుడు జీరో సైజ్ లోకి వచ్చింది. చేతిలో మందు గ్లాసు, అరకొర ఆరబోసిన అందాలతో ఉన్న శ్వేత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here