Vijay Deverakonda : పులులకు పాలు తాగిస్తూ.. పాములతో విన్యాసాలు చేసిన రౌడీ హీరో.. వీడియో వైరల్…Vijay Deverakonda : తెలుగు చిత్ర పరిశ్రమలో క్రెజీ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ హిట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దుబాయ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఈయన వెకేషన్ వెళ్తూ తన ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.. అందుకు సంబందించిన వీడియోలు ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

Vijay Deverakonda
Vijay Deverakonda

ఫ్యామిలీ తో కలిసి ట్రిప్ వెళ్లిన విజయ్ దేవరకొండ అక్కడ ఓ జూ ను సందర్శించారు. ఈ క్రమంలోనే జూలో ఉన్నటువంటి క్రూరం మృగాలతో విజయ్ దేవరకొండ ఎంతో చిల్ అవుతూ కనిపించారు.. ఎవరైనా క్రూర మృగాలను చూస్తే భయంతో వణికి పోతారు.. కానీ విజయ్ దేవరకొండ మాత్రం వాటితో సావాసం చేస్తూ, కాసేపు సరదాగా ఆడుకున్నారు.. వాటితో ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా పులికి పాలు పట్టించడమే కాకుండా భయంకరమైన కొండచిలువలను ఏకంగా మెడలో వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు.

Vijay Deverakonda with snakes

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. వీటిని చూస్తేనే ఒళ్ళు గోగ్గురు పుడుతోంది అలాంటిది ఈయన పాములను మెడలో వేసుకొని సింహం పులుల పిల్లలకు పాలు పట్టిస్తూ సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చారు. నిజానికి తనకు పాములంటే చాలా భయమని అయితే జ్యూ సిబ్బంది సహాయంతో తాను ఇలా కొండచిలువలతో గడిపానని తెలిపారు. తాను సింహం పులులతో మాట్లాడటానికి తనకు సహకరించిన జూ సిబ్బంది, క్యూరేటర్స్ కి స్పెషల్ థాంక్స్ అని తుంది అంటూ ఈయన క్రూర మృగాలతో పాములతో కలిసి దిగిన వీడియోను షేర్ చెయ్యడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.