Vijay Deverakonda – Rashmika డేటింగ్ పై క్లారిటి.. ఓవర్ గా ఆలోచించకు అంటూ పోస్ట్.. వైరల్..

- Advertisement -

Vijay Deverakonda- Rashmika టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతుంది..సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అతి త‌క్కువ కాలంలోనే ఇటు సౌత్ సినిమాల్లోనే కాదండోయ్‌, బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించి అక్క‌డి వారిని ఆక‌ట్టుకుంది. ఇప్పుడామె పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2లో శ్రీవ‌ల్లిగా మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. మ‌రో వైపు రెయిన్ బో అనే హీరోయిన్ సెంట్రిక్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసి ట్రాక్ ఎక్కించేసింది. మూవీస్ ప‌రంగా ర‌ష్మిక ఎంత ట్రెండింగ్‌లో ఉంటుందో కొన్ని విష‌యాల ప‌రంగానూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తుంటుంది. ఈ అమ్మడు హీరో విజయ్ దేవరకొండ తో డేటింగ్‌లో ఉందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ వార్తలపై రష్మిక రియాక్ట్ అయ్యింది..అందుకు సంబందించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..

Vijay Deverakonda -  Rashmika
Vijay Deverakonda – Rashmika

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రేమ‌లో ఉంద‌నే న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతూనే ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్లు వారిద్దరూ ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో కెమెరాల కంటికి చిక్కారు. అయితే ఈ మ‌ధ్య అలాంటి వార్త‌ల‌కు ర‌ష్మిక దూరంగా ఊంటూ త‌న కెరీర్‌పై ఫోక‌స్ చేసింది. ఈ నేప‌థ్యంలో రీసెంట్‌గా ఆమె బ‌ర్త్ డే వ‌చ్చింది. ఫ్యాన్స్‌, నెటిజ‌న్స్ సోషల్ మీడియా ద్వారా ర‌ష్మిక‌కు అభినంద‌న‌లు తెలిపారు. దానికి ప్ర‌తిగా ఆమె వారికి ధన్య‌వాదాల‌ను తెలియ‌జేస్తూ వీడియో రిలీజ్ చేసింది..అంత ఎక్కువగా ఆలోచించ‌కు అంటూనే మరో వార్తకు తెరలేపింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న డేటింగ్‌లో ఉన్నార‌న‌టాన్ని ఈ వీడియో మ‌రోసారి ప్రూవ్ చేసింద‌ని, విజ‌య్ దేవ‌ర‌కొండ ఫేవ‌రేట్ రింగు ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న చేతికి ఉంద‌ని, వారిద్ద‌రూ ఇప్పుడు ఓ ఇంట్లో క‌లిసి ఉంటున్నార‌ని, త్వ‌ర‌లోనే వారిద్ద‌రూ మ‌న‌కు గుడ్ న్యూస్ చెప్పేస్తారనే వార్త‌లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అయితే ఈసారి ఈ వార్త‌ల‌ను ర‌ష్మిక కాస్త సీరియ‌స్‌గానే తీసుకుందేమో .. ఓ ట్వీట్‌కి రిప్ల‌య్ ఇస్తూ ‘అయ్యో.. ఓవర్‌గా ఆలోచించకు బాబు’ అంటూ ఆమె రిప్లయ్ ఇచ్చింది.. అది ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.. మరి రింగ్ గురించి అమ్మడు ఏం చెబుతుందో చూడాలి.. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు..

https://twitter.com/SDM_official1/status/1643851677651570689?t=AhqLd-OVsfMMJaP2ZZ6piw&s=19
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here