ఒకే ఒక్క పోస్టర్ తో పాన్ వరల్డ్ సినిమాలను పక్కకి నెట్టేసిన Ustaad Bhagat Singh.. పవర్ స్టార్ రేంజ్ ఇది!

- Advertisement -

Ustaad Bhagat Singh నిన్న సోషల్ మీడియా మొత్తం సరికొత్త అప్డేట్స్ తో నిండిపోయింది.స్టార్ హీరోల ప్రతిష్టాత్మక సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో టైం లైన్స్ కళకళలాడిపొయ్యాయి.ముందుగా ఎన్టీఆర్ – హ్రితిక్ రోషన్ కాంబినేషన్ లో ‘వార్ 2’ అనే సినిమా వస్తున్నట్టు అధికారిక ప్రకటన జరిగింది.దీనికి సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది,ఇక ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప : ది రూల్’ కి సంబంధించి ప్రీ టీజర్ ఒకటి వచ్చింది.

Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh

దీనికి కూడా ఫ్యాన్స్ నుండి రెస్పాన్స్ అదిరిపోయింది, రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మెయిన్ టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు.ఈ రెండు అప్డేట్స్ తో సోషల్ మీడియా మంచి ఊపు మీద ఉంది.అయితే ఈ రెండు సినిమాలతో పాటుగా పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.

pawan

నిన్న రాత్రి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు అంటూ ఒక వర్కింగ్ స్టిల్ ని వదిలారు, సోషల్ మీడియా మొత్తం పూనకం వచ్చినట్టు ఊగిపోయింది.ఉదయం నుండి వచ్చిన ఆ రెండు పాన్ వరల్డ్ మూవీ హైప్ మొత్తాన్ని, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అనే ప్రకటన దాటేసింది అంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -
shankar

నిన్నటి నుండి నేటి వరకు ఈ పోస్టర్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది.మొదటి షెడ్యూల్ పది రోజుల పాటు సాగనుంది, ఈ ఏడాది లోపు మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.త్వరలోనే దీనికి సమందించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here