Rashmika Mandanna: హృదయం ముక్కలైంది.. వాటికి ముగింపు పలకాలనుకుంటున్నా..

- Advertisement -

ఈ కాలంలో సినీ పరిశ్రమలో ఏ నటికైనా తప్పని సమస్య సోషల్ మీడియాలో ట్రోలింగ్. ఫ్యాన్స్ తమ అభిమానంతో ముంచెత్తితే.. గిట్టని వారు మాత్రం ట్రోల్స్ తో విసిగిస్తారు. ఎంత పెద్ద నటీనటులైనా వీటిని ఎదుర్కోవాల్సిందే. తాజాగా సోషల్‌మీడియాలో తన గురించి వస్తోన్న నెగెటివిటీ, ట్రోల్స్ , పుకార్లపై గీతాగోవిందం బ్యూటీ రష్మిక స్పందించింది. తను మాట్లాడని విషయాల గురించి కూడా హేళన చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని వాటిని చూసి హృదయం ముక్కలైందని.. ఇప్పటికే ఆలస్యమైందని వీటన్నింటికి చెక్ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇన్‌స్టా వేదికగా రష్మిక ఓ పోస్ట్‌ చేసింది.

కొన్నేళ్ల నుంచి సోషల్‌మీడియాలో  వస్తున్న ట్రోల్స్‌, నెగెటివిటీ నన్ను బాధపెట్టాయి. విమర్శలను పట్టించుకోకూడదని ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నా. కానీ, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. పలు ఇంటర్వ్యూల్లో నేను మాట్లాడిన కొన్ని మాటలు నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించా. ఇంటర్నెట్‌లో వస్తోన్న తప్పుడు సమాచారం వల్ల నా సహచరులకు కూడా ఇబ్బంది కలిగింది. ఇప్పుడు మీతో వాటిని పంచుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నా. నటిగా కెరీర్‌ మొదలైన నాటి నుంచీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నా. నేను ఎంచుకున్న ఫీల్డ్ అలాంటిది. ఇక్కడ అందరికీ నేను నచ్చనని.. అలాగే, ప్రతిఒక్కరి ప్రేమను పొందాలనుకోకూడదని అర్థమైంది. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం మాత్రమే నాకు తెలుసు. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే ఇంతటి గుర్తింపు తెచ్చుకున్నా. మీరూ, నేనూ గర్వించే విధంగా పనిచేసేందుకే శ్రమిస్తున్నా. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. అని రష్మిక పేర్కొంది.

అయితే రష్మిక సినీ జీవితంలోనే కాకుండా వ్య‌క్తిగ‌త జీవితంలోనూ విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ర‌క్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకున్నసప్పుడు స‌ద‌రు హీరో ఫ్యాన్స్ ర‌ష్మిక‌ను తెగ ట్రోల్ చేశారు. త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌ డేటింగ్ చేస్తుందంటూ వార్త‌లు చక్కర్లు కొట్టాయి. క‌న్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినీ కెరీర్ ప్రారంభించిన ర‌ష్మిక .. తెలుగులో ఛ‌లో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత విజయ్ దేవరకొండతో గీతా గోవిందం, సూపర్ స్టార్ మహేష్ బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు, పుష్ప ది రైజ్ చిత్రంలో శ్రీవ‌ల్లిగా బన్నీతో జ‌త క‌ట్టింది.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here