విజయ్ దేవరకొండ మరియు సమంత కాంబినేషన్ లో గత కొంత కాలం నుండి ‘ఖుషి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని వచ్చే నెల 1 వ తేదీన విడుదలకు సిద్ధం గా ఉన్నది. నిన్ను కోరి, మజిలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ‘లైగర్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ, ‘శాకుంతలం’ వంటి డిజాస్టర్ తర్వాత సమంత కాంబినేషన్ నుండి వస్తున్నా సినిమా ఇది. ఇరువురి అభిమానులు ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

హీరో విజయ్ దేవరకొండ కాశ్మీర్ కి ట్రిప్ కోసం వెళ్తాడు, అక్కడ హీరోయిన్ సమంత ని చూసి ప్రేమలో పడుతాడు. సమంత హీరో కి ఒక ముస్లిం అమ్మాయి గా పరిచయం అవుతుంది. కానీ వాస్తవానికి ఆమె ఒక బ్రాహ్మీన్. అయితే ఆమె ఎందుకు కాశ్మీర్ లో ముస్లిం గా హీరో కి పరిచయం అయ్యింది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది?, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురు అయ్యాయి వంటివి తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాలి. ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు చాలా ల్యాగ్ అనిపించింది.

హీరో విజయ్ దేవరకొండ క్యారక్టర్ ని చూస్తే ‘గీత గోవిందం’ ని పోలి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి స్లో గా సాగే కథనం ఉన్న సినిమాలు థియేటర్స్ లో ఆడడం చాలా కష్టం. అసలే ఈ ఏడాది సక్సెస్ రేట్ చాలా తక్కువ, ఫ్లాప్ అయినా సినిమాలే ఎక్కువ. మరి ఈ చిత్రం ఆడియన్స్ ని అలరిస్తుందా లేదా నిరాశపరుస్తుందా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 1 వ తేదీ వరకు ఆగాల్సిందే.