‘గుంటూరు కారం’ లేటెస్ట్ పోస్టర్ అదుర్స్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మహేష్ బాబు నటిస్తున్నాడా..?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు మహేష్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిపోయిన చిత్రాలలో ఒకటి ‘బిజినెస్ మేన్’ ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయించారు. స్టార్ హీరో కొత్త సినిమా విడుదలైతే థియేటర్స్ ఎలా కిక్కిరిసిపోతాయో, ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో జనాలు వచ్చారు.

గుంటూరు కారం
గుంటూరు కారం

మొదటి రోజు కచ్చితంగా ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొట్టి, ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతుందని ఫ్యాన్స్ బలమైన నమ్మకం తో ఉన్నారు. ఇకపోతే మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ చిత్రానికి సంబంధించి నిన్న అర్థ రాత్రి ఒక పోస్టర్ ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పోస్టర్ లో మహేష్ బాబు లుంగీ కట్టుకొని,అరుగు మీద కూర్చొని స్టైల్ గా బీడీ వెలిగిస్తున్న ఫోజు అభిమానులకు తెగ నచ్చేసింది.

అయితే ఈ పోస్టర్ చూడగానే అందరికీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గెటప్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు కాసేపటి క్రితమే మరో మాస్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ లో మహేష్ బాబు కళ్ళజోడు పెట్టుకొని, ఎర్రతుండు తలకు చుట్టుకొని నిలబడ్డ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ పోస్టర్ ని చూసి అందరూ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో పోల్చి చూస్తున్నారు. ఇలా వరుసగా విడుదలైన రెండు పోస్టర్స్ లో కూడా పవన్ కళ్యాణ్ పాత సినిమాల లుక్స్ ని పోలి ఉండడం చూసి, నెటిజెన్స్ ‘గుంటూరు కారం’ చిత్రం లో మహేష్ ని త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చూపించాడా? అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఏది ఏమైనా మహేష్ బాబు ని త్రివిక్రమ్ ఇది వరకు ఎన్నడూ చూడని ఊర మాస్ యాంగిల్ లో ఈ చిత్రంలో చూపిస్తున్నట్టు అర్థం అయ్యింది. యావరేజి సినిమాలను సైతం వంద కోట్ల రూపాయిల షేర్ వైపు పరుగులు తీయించే సత్తా ఉన్న మహేష్ బాబు ఈసారి క్రేజీ కాంబినేషన్ తో మన ముందుకు రాబోతున్నాడు. మరి ఈ చిత్రం తో ఆయన ఎలాంటి రికార్డ్స్ నెలకొల్పుతాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here