డైరెక్టర్ వినాయ‌క్‌కి బాల‌య్య పెట్టిన ముద్దు పేరు ఎంటో తెలుసా?

- Advertisement -

బయటి ప్రపంచానికి బాలయ్య కోపిష్టి అయ్యుండొచ్చు కానీ, సన్నిహితులు మాత్రం ఆయన్ను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తారు. పుట్టి పెరిగింది సినీ నేపథ్యమున్న కుటుంబంలోనే అయినప్పటికీ.. కష్టం విలువ తెలిసిన వ్యక్తి కావడంతో, సెట్స్‌లో పని చేసే పని ఒక్కరినీ ఎంతో గౌరవిస్తారు. తానో పెద్ద స్టార్ అయినప్పటికీ, అహం లేకుండా అందరితో స్నేహంగా మెలుగుతారు. బాలయ్యలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. తను అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తులకు బాలయ్య ముద్దు పేర్లు పెట్టుకుంటారు.

బాల‌య్య
బాల‌య్య

మామూలు పేర్లతో పిలుచుకుంటే ఏముంటుంది బొంగు, ముద్దు పేర్లుంటే అసలైన కిక్కు అంటూ.. బాలయ్య తనకు క్లోజ్‌గా ఉండే వాళ్లకు తనదైన శైలిలో ముద్దు పేర్లు పెడుతుంటారు. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్‌కి కూడా బాలయ్య ఓ నిక్‌నేమ్ పెట్టారు. ఏంటో తెలుసా? సత్తిరెడ్డి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా..! ఎస్, గుర్తొచ్చిందా? చెన్న కేశవ రెడ్డి సినిమాలో ఆ పేరుంది.

వివి వినాయక్, బాలయ్య కాంబినేషన్‌లో ‘చెన్న కేశవ రెడ్డి’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బాగానే కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే.. వినాయక్‌కు బాలయ్య ‘సత్తిరెడ్డి’ అనే నిక్‌నేమ్ పెట్టారు. ఆ సినిమాలో ఒక పాత్రకు సత్తిరెడ్డి అనే పేరు ఉంటుంది. బాలయ్యకు నమ్మకంగా ఉంటూ, ప్రతీ సిచ్యువేషన్‌లోనూ తోడుగా ఉండే పాత్ర అది.

- Advertisement -

ఇక సినిమా షూటింగ్ ముగిసేదాకా దర్శకుడు, హీరో మధ్య కూడా దాదాపు అలాంటి బంధమే ఉంటుంది కాబట్టి.. ఆ కోణంలో వినాయక్‌కు బాలయ్య ‘సత్తిరెడ్డి’ అని పిలుస్తూ ఆటపట్టించేవారు. దీన్ని బట్టి.. బాలయ్య సెట్స్‌లో ఎంత సరదాగా, సాన్నిహిత్యంగా ఉంటారో మీరే అర్థం చేసుకోండి. దటీజ్ బాలయ్య! ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. వీరి కాంబోలో నెక్ట్స్ సినిమా ఎప్పుడు వస్తుందన్నదే మిస్టరీగా మారింది. అసలు ఉంటుందంటారా? అందుకు కాలమే సమాధానం చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here