తన కెరీర్లో ఇప్పటివరకు చేయని రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. మామూలుగా ఉండదు

- Advertisement -


టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా.. నిన్నుకోరి, మజిలీ వంటి హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో రీసెంట్ గా వచ్చిన సినిమా ఖుషి. విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద హిట్ గా నిలిచింది. అలాగే దాదాపు రూ.70కోట్లకు పైగా వసూలు చేసి విజయ్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది. విజయ్ దేవరకొండ తన కెరీర్లో ఇప్పటి వరకు పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు ఊహించని విధంగా భారీ సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న విజయ్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. ఈ సినిమా విజయం సాధించడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే విజయ్ ఇప్పటి వరకు లవ్ స్టోరీ సినిమాలే తీస్తారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అవుతుందని టాక్ ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తోంది. విజయ్ కెరీర్ లో ఇప్పటివరకు చేయనటువంటి కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడట. ఈ సినిమా కథ నిజ జీవితంలోని సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై రౌడీ భాయ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుంటారో..!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here