విజయ్ దేవరకొండ కి ఇన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయా..చూస్తే ఏడుపు ఆపుకోలేరు!

- Advertisement -

విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి అతి తక్కువ సమయం లోనే యూత్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. హిట్ మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ అయితే ఉంటుందో, విజయ్ దేవరకొండ కి కూడా అలాంటి క్రేజ్ ఏర్పడింది ఈమధ్య కాలం లో, ఇది కాదు అనలేని నిజం.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తో తోడు, ఎంచుకుంటున్న సినిమాలు కూడా ఆయనకీ ఈ రేంజ్ క్రేజ్ రావడానికి దోహదపడ్డాయి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా ఇలా వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండ, గత కొంత కాలం నుండి గడ్డు కాలం ఎదురుకుంటున్నాడు. ఆయన చివరి చిత్రం ‘లైగర్’ ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.

అయ్యినప్పటికీ కూడా, విజయ్ దేవరకొండ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు, తన తదుపరి చిత్రాలతో ఇండస్ట్రీ మొత్తం రీ సౌండ్ వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతాను అనే నమ్మకంతో ఉన్నాడు ఆయన.ప్రస్తుతం ఆయన సమంత తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం చేస్తున్నాడు, ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల కాబోతుంది. ఇక నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ కి సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తి కరమైన విషయాన్నీ ఇప్పుడు చెప్పబోతున్నాము.

- Advertisement -

విజయ్ దేవరకొండ ఒక మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు అతని దగ్గర ఏమి లేవు, అయితే హీరో గా నిలదొక్కుకున్న సమయం లో కూడా విజయ్ దేవరకొండ వద్ద అందరూ అనుకున్నట్లు గా కోట్ల రూపాయిలు ఏమి లేవట. కానీ డబ్బులు మాత్రం బాగానే ఉన్నాయి, EMI లు కట్టుకుంటున్నాను అని గతం లో ఆయన చెప్పుకొచ్చాడు. ఇక లైగర్ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం లో కరోనా లాక్ డౌన్ పడడం వల్ల మనీ రొటేషన్ ఆగిపోవడం తో కాస్త ఆర్ధంగా ఇబ్బందికి గురి అయ్యాడట. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత షూటింగ్ కి వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండేవి కాదట, అలాంటి పరిస్థితులను కూడా చూసాను అని చెప్పుకొచ్చాడు.ఇలా ఎన్నో కష్టాల నడుమ ఈ స్థాయికి చేరుకున్న విజయ్ దేవరకొండ, తన తదుపరి చిత్రాలతో మరింత ఎత్తుకి ఎదగాలని ఆసిస్తూ పుట్టిన రోజు సుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here