విజయ్ దేవరకొండకు సమంత బర్త్ డే విషెస్.. ఆ పోస్టుతో నాగ చైతన్యపై ఇండైరెక్ట్ అటాక్

- Advertisement -

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా సినీ ప్రముఖులంతా విజయ్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో మొత్తం విజయ్ హవానే నడుస్తోంది. ఈ బర్త్ డే బాయ్ ఇవాళ నెట్టింట ట్రెండింగ్లో ఉన్నాడు. విజయ్కు తన కో స్టార్ సమంత కూడా బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే ఈ బ్యూటీ బర్త్ డే విషెస్ పోస్టు ప్రస్తుతం ఇంటర్నెట్లో రచ్చ లేపుతోంది. సామ్ విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేస్తూ పోస్టు పెట్టింది. సీడీపీ రిలీజ్ చేస్తే రచ్చ ఏముందంటారా..? అది కాదు అసలు మ్యాటర్. ఇంతకీ ఏంటంటారా..?

సమంత
సమంత

సమంత తన ఖుషీ కో స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్గా సీడీపీ రిలీజ్ చేసి తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టింది. “నా మంచి స్నేహితుడు, నా ఫేవరేట్ కో-స్టార్‌ విజయ్‌ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నీ సక్సెస్‌ కోసం నేను ప్రార్థిస్తున్నా, విషెస్‌ తెలియజేస్తున్నాను.. ఎందుకంటే నువ్వు నిజంగా అన్నింటిలో బెస్ట్ పొందేందుకు అర్హత కలిగి ఉన్న వ్యక్తివి` అని సమంత క్యాప్షన్ జోడించి పోస్టు చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన ఈ పోస్టు నెట్టింట హల్ చల్ సృష్టిస్తోంది. ఇందులో అంత హల్ చల్ సృష్టించే మ్యాటర్ ఏముంది అంటారా..?మీరు విజయ్ దేవరకొండ అభిమానియో లేక సమంత ఫ్యానో అయితే ఏం కాకపోయేది. కానీ మీరు నాగచైతన్య ఫ్యాన్ అయితే మాత్రం సామ్ పోస్టులో అంతరార్థం వెతికేవారు. ఇప్పుడు చై ఫ్యాన్స్ చేసిన పని అదే.

HBD Vijay Deverakonda
Samanthapost

సామ్ చేసిన పోస్టులో తన ఫేవరెట్ కో-స్టార్ విజయ్ అని మెన్షన్ చేసింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు.. నాగ చైతన్యతో సామ్ నాలుగు సినిమాలు (ఏం మాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలీ, ఇక బేబీలో కామియో) చేసింది. అయినా తన ఫేవరెట్ కో స్టార్ విజయ్ దేవరకొండ అని చెప్పడం వెనుక.. సామ్ కావాలనే చైతన్యకు జెలసీ కలిగేలా చేస్తోందని చై ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక సామ్ గతంలో విజయ్ దేవరకొండతో కలిసి మహానటి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అందులో ఈ ఇద్దరి లవ్ ట్రాక్ కూడా బాగానే ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఇక ఇప్పుడు ఖుషీ సినిమాలో నటిస్తోంది ఈ జంట. ఈ చిత్రంలో రొమాంటిక్ కపుల్గా కనిపించనున్నట్లు టాక్. ఈ క్రమంలో సమంత చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here