Leo Movie : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ కి తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన సినిమాలు మన దేశంలో భారీ స్థాయిలో విడుదలవుతాయి. మంచి టాక్ వస్తే టాలీవుడ్లో కూడా కలెక్షన్లు బాగుంటాయి. ఈ ఏడాది వారసుడు సినిమాతో సక్సెస్ అందుకున్న విజయ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ ప్రస్తుతం సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అలరిస్తూ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా ఐమాక్స్ వెర్షన్ గురించిన అప్‌డేట్ ఇచ్చారు. యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా లియో సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డును బీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను నెవర్ బిఫోర్ రేంజ్ లో అమెరికాలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు లోకేష్ కూడా లియో కోసం మరింత గ్రాండ్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐమాక్స్ స్క్రీన్లలో దాదాపు 80 స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ విడుదలైంది. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడానికి విజయ్ లియో విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 80కి పైగా ఐమాక్స్ స్క్రీన్‌లు ఉన్నాయి. సెవెన్ స్క్రీన్ స్టూడియోలో లలిత్ కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.