హీరో శ్రీకాంత్ ని పబ్లిక్ స్టేజి మీద చితకబాదిన స్టార్ హీరోయిన్..వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

Srikanth : హీరో శ్రీకాంత్ పేరు తియ్యగానే మన అందరికీ ఆయన పోషించిన సాఫ్ట్ రోల్స్, లవర్ బాయ్ రోల్స్ మన కళ్ళ కదలాడుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు లేడీస్ ఫాలోయింగ్ లో శ్రీకాంత్ అప్పటి స్టార్ హీరోలకు పోటీని ఇచ్చేవాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన కెరీర్ ప్రారంభం లో చిన్న రోల్స్ మరియు నెగటివ్ రోల్స్ చేస్తుండేవాడు.

Srikanth
Srikanth

ఆ తర్వాత హీరో గా మారి, అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని వందకి పైగా సినిమాల్లో హీరో గా నటించాడు. ఒక్క చిరంజీవి మరియు బాలకృష్ణ తప్ప వంద కి పైగా సినిమాలు చేసిన హీరోలు ఎవ్వరూ లేరు. ఇక హీరో గా మార్కెట్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా మారి, ఇండియా లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న నటులలో ఒకడిగా మారాడు.

ఇదంతా పక్కన పెడితే శ్రీకాంత్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించి ఉంటాడు, కానీ ఆయనకీ సరైన జోడి అనిపించినా ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు రాశీ. వీళ్ళ జంట ఆన్ స్క్రీన్ మీద చూస్తే నిజమైన భార్య భర్తలు లాగ అనిపిస్తారు, అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది వీళ్ళ మధ్య కెమిస్ట్రీ.

- Advertisement -

వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటి వరకు 9 సినిమాలు వచ్చాయి, వాటిల్లో అధికశాతం సూపర్ హిట్ అయ్యినవే. అలాంటి వీళ్లిద్దరు మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుందో నిన్న జరిగిన ‘రుద్రంకోట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మారింది. వీళ్ళు కలిసి ఉన్నంతసేపు ఎదో ఒక జోక్ వేసుకుంటూనే ఉన్నారు. స్టేజి పైకి ఎక్కిన తర్వాత శ్రీకాంత్ రాశీ ని చూసి సిగ్గుపడుతుంటే , రాశీ అతనిని సరదాగా వీపు మీద కొడుతోంది, ఆ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here