Nani : దసరాలో ప్రేక్షకులు చూడని వెన్నెల ఆవేదన.. డీలేటెడ్ సీన్స్..

- Advertisement -

Nani కీర్తి సురేష్, జంటగా నటించిన తాజాగా చిత్రం దసరా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి హిట్ టాక్ ను అందుకుందో చూస్తూనే ఉన్నాం.. కలెక్షన్ల వర్షం కురుస్తుంది.. మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ను అందుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా..ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటిరోజే మంచి కలెక్షన్స్ రాబట్టింది.పూర్తిగా తెలంగాణ యాసలో వచ్చిన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన దసరా చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో కనిపించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని చమ్కీల అంగిలేసి పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది…

Nani
Nani

ఇకపోతే ఇటీవల విడుదలైన వెన్నెల మాస్ డాన్స్ వీడియో అయితే నెట్టింటిని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన వెన్నెల మాస్ డాన్స్ ఓ ఊపు ఉపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ నుంచి డిలీట్ చేసిన ఓ సన్నివేశాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో ఇప్పటివరకు ప్రేక్షకుడు చూడని వెన్నెల ఆవేదన చూపించారు. “నిన్నే.. అంత కానిదాన్నైపోయినా.. అడెవడో వచ్చి తాళి కడతాంటే ఆపేది పోయి ఇంక మీదకెళ్లి తీస్కపో అని చెప్పి నన్ను వదిలించుకున్నవ్.. నువ్వసలు తల్లివేనా ? అంటూ కీర్తి చెప్పే డైలాగ్ తో వీడియో మొదలైంది. అందరూ కూడా నా బతుకును ఎట్లే చేశిర్రో చూశినవా అని అత్త ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తుంది వెన్నెల..

అప్పుడే వెన్నెల అత్త వచ్చి తన అత్తారింటి ముందుకు తీసుకెళ్లి.. గిదే నీ ఇల్లు.. ఈడ్నే నీ బతుకు.. నా మాట విని లోపలికి పోవే.. నీ బాంచెనే.. అంటూ వెన్నెలను బతిమాలుకుని వెళ్లిపోతుంది. ఏడుస్తూ అక్కడే నిలబడిపోతుంది వెన్నెల. అయితే వీరి సంభాషణంతా అక్కడే గోడ వెనక ఉన్న ధరణి వింటుంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.. ఈ సీన్ లో కీర్తి సురేష్ చాలా అద్భుతంగా నటించింది.. అయితే ఎందుకు డిలీట్ చేశారోనని జనాలు అంటున్నారు.. మొత్తానికి ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది.. మీరు ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here