Veerasimha Reddy Vs Waltheru Veeraiah : వీరసింహారెడ్డి Vs వాల్తేరు వీరయ్య.. ప్రీ బిజినెస్​లో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే..?



Veerasimha Reddy Vs Waltheru Veeraiah : ప్రజెంట్ సినిమా ప్రేక్షకుల ఫోకస్ అంతా సంక్రాంతిపైనే. ఈ పండుగకు థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్న సినిమాలపైనే. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతి బరిలో హాట్ టాపిక్ ఏంటంటే.. ఇద్దరు అగ్రహీరోలు ఒకేసారి కలిసి రావడం. బాలయ్య బాబు, చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ షేక్ చేయడానికి కలిసి వస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమాతో బాలకృష్ణ.. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి తమ కెరీర్​లో మరో బ్లాక్​బస్టర్ హిట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చిత్రమేంటంటే ఈ రెండు సినిమాలు ఒకే బ్యానర్​లో వస్తున్నాయి.

Veerasimha Reddy Vs Waltheru Veeraiah
Veerasimha Reddy Vs Waltheru Veeraiah

ఒకే బ్యానర్ నుంచి ఒక రోజు తేడాలో రెండు భారీ సినిమాలు రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు.కానీ మైత్రీ ఆ సాహసం చేసింది. అదే సమయంలో ఈ సాహసానికి ఏ స్దాయి ఖర్చు పెట్టింది.. ఎంత రిటర్న్స్ ఉంటాయి అనేది లెక్కించాల్సిన విషయం. అందులోనూ రెండు సినిమాల్లో చేసింది సీనియర్ హీరోలే. వాళ్లిద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి మైత్రీ మూవీస్ ఏ సినిమాకు ఎంత ఖర్చు పెట్టింది. ప్రస్తుతం ఈ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉంది..? ప్రీ రిలీజ్​లో పై చేయి వీరసింహా రెడ్డిదా లేక వాల్తేరు వీరయ్యదా ఈ లెక్కలన్నీ ఓసారి చూసేద్దామా..?

ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు వాల్తేరు వీర‌య్య కోసం మైత్రీ మూవీస్ దాదాపుగా రూ.140 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. వీర సింహారెడ్డి కోసం మ‌రో రూ.110 కోట్లు అయ్యింద‌ని టాక్. మొత్తం క‌లిపి రూ.250 కోట్లు. ప్రీ బిజినెస్ కూడా అదే స్దాయిలో జరిగిందని సమాచారం. ఇప్పటికే చాలా ఏరియాల్లో సినిమాని మంచి లాభాలకే అమ్మేశారట. కానీ ఏ సమస్యా రాకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ సినిమాలు రెండూ పెద్ద హిట్ట‌వ్వాల్సిందే. ఈ రెండు సినిమాలూ రూ.300 కోట్లు సాధిస్తే మైత్రీ మూవీస్​ ఖుష్ అయిపోతుంది.

`గాడ్ ఫాద‌ర్‌`తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో మాస్​మహారాజ రవితేజ నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమా మార్కెట్ చాలా పెద్దగానే ఉంటుంది. దానికి తగ్గట్టే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టాక్. వాల్తేరు వీరయ్యను నైజాంలో 18 కోట్లకు, ఆంధ్రలో 40 కోట్లు, సీడెడ్‌లో 14.5కోట్లకు అమ్మినట్టు సమాచారం.

Balakrishna And Chiranjeevi
Balakrishna And Chiranjeevi

మరోవైపు అఖండ తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న మూవీ వీరసింహా రెడ్డి. చిరంజీవి కంటే బాలయ్య మార్కెట్ కాస్త తక్కువే అని చెప్పొచ్చు. కానీ బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు తప్పక థియేటర్లకు పరుగు పెడతారు. బాలకృష్ణ సినిమా థియేటర్​లో చూస్తేనే కిక్ అని ఆడియెన్స్ ఫీల్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి కూడా మంచి బిజినెస్ చేస్తుందని టాక్. వీరసింహారెడ్డి సినిమాను ఆంధ్రాలో రూ.35 కోట్లకు, నైజాంలో రూ.15 కోట్లు, సీడెడ్‌లో రూ.12.5 కోట్లకు అమ్మినట్టు తెలుస్తోంది.

మరి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలలో ఎవరు టార్గెట్ రీచ్ అయి బ్రేక్ ఈవెన్ చేరతారో చూడాలి.