Big Boss Punarnavi : ఈ మధ్య సినీ ఇండస్ట్రీని వ్యాధులు వదలడం లేదు.. ఒక్కొక్కరూ కూడా అరుదైన వ్యాధులతో బాధ పడుతున్నారు..ఇప్పటికే చాలా మంది వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు..ఇప్పుడు మరో హీరోయిన్ అరుదైన వ్యాధితో భాద పడుతుంది..పునర్నవి భూపాలం కూడా ఊపిరి తిత్తుల వ్యాధితో భాధ పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి..రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన ఉయ్యాలైన జంపాలైన లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి ఆకట్టుకుంది పునర్నవి.ఆ సినిమా తర్వాత మరో సినిమాలో పెద్దగా కనిపించలేదు.. ఆ తర్వాత బిగ్ బాస్ లో కనిపించించింది.
బిగ్ బాస్ వల్ల ఈ అమ్మడుకు ఫుల్ క్రేజ్ వచ్చి పడింది. బిగ్ బాస్ హౌస్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కు పునర్నవికి మధ్య సంథింగ్ సంథింగ్ అటు బాగా ప్రచారం జరిగింది. దాంతో ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది పునర్నవికి. అయితే ఈ భామ మాత్రం చిత్రాల్లొ మెరవలేదు. విదేశాల్లో చదువుకుంటూ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది పునర్నవి..అయిన కూడా పెద్దగా ఎక్కడ కనిపించలేదు..
తాజాగా పునర్నవి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఆమె అభిమానులను షాక్ ను ఇస్తోంది. తనకు అనారోగ్యంగా ఉందని చాలా రోజులుగా ఈ అనారోగ్యంతో బాధపడుతున్న అని పోస్ట్ పెట్టింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నా అని ఆ పోస్ట్ ద్వారా తెల్పింది పునర్నవి. పునర్నవి అనారోగ్యానికి గురైందని తెలిసి ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. పునర్నవి త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు..ఏది ఏమైనా ఇలాంటి వార్తలు వినడం నిజంగా భాధగా అనిపిస్తుంది..అతి చిన్న వయస్సులోనే ఇలా వ్యాధుల బారిన పడటం నిజంగా బాధాకరం..