Aha movie : సంక్రాంతి టు ఉగాది.. ఆహాలో నాన్​స్టాప్ ఎంటర్​టైన్మెంట్​

- Advertisement -

Aha movie : కొత్త ఏడాది షురూ అయింది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్నసినిమాలు వరుస కట్టాయి. థియేటర్​లో ఈ వీక్ అంతా చిన్నసినిమాలదే సందడి. వచ్చే వారం మాత్రం అగ్ర హీరోల మూవీస్​తో బాక్సాఫీస్ షేక్ కానుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణలు ఈసారి సంక్రాంతికి పోటీ పడుతున్నారు. ఈ ఏడాది పోటీలో నాగార్జున మిస్ అయ్యారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి సందడి చేసే నాగ్.. ఈ ఏడాది కాస్త బ్రేక్ ఇచ్చారు.

Aha movie
Aha movie

మరోవైపు ఓటీటీలు కూడా సూపర్ హిట్ కంటెంట్​తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాయి. గతేడాది ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్​లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. లాస్ట్ ఇయర్ అందించిన జోష్​తో కొన్ని ఓటీటీలు సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసి సిరీస్​లు, సినిమాలు నిర్మిస్తున్నాయి.

Sankranthi Movies
Sankranthi Movies

ఇదే బాటలో తెలుగు ఓటీటీ ఆహా కూడా పయనిస్తోంది. ఈ ఏడాది సరికొత్త సినిమాలు, కార్యక్రమాలు, వెబ్ సిరీస్​లతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఆహా ఓటీటీ రెడీ అయింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి ఉగాది వరకు ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ వినోదం పంచేందుకు ఓటీటీ సంస్థ ‘ఆహా’ సిద్ధమైంది. త్వరలో తమ యాప్‌లో స్ట్రీమింగ్‌ కాబోయే కొత్త సినిమాలు,సిరీస్‌లు, రియాలిటీ షో వివరాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోనూ విడుదల చేసింది. థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాల జాబితాను ఇప్పుడే ప్రకటించి, ఆసక్తి పెంచుతోంది.

- Advertisement -

కొత్తగా ఏం రాబోతున్నాయంటే..

సినిమాలు

మైఖేల్‌ (సందీప్‌ కిషన్‌ హీరో)

వినరో భాగ్యము విష్ణు కథ (కిరణ్‌ అబ్బవరం హీరో)

కల్యాణం కమనీయం (సంతోశ్‌ శోభన్‌ హీరో)

ఆహా ఒరిజినల్‌ ఫిల్మ్స్‌/ వెబ్‌ సిరీస్‌లు

ఇంటింటి రామాయణం

సత్తిగాని రెండెకరాలు

పాపం పసివాడు

న్యూసెన్స్‌

బాలుగాని టాకీస్‌

గీతా సుబ్రహ్మణం 3

బీఎఫ్‌ఎఫ్‌ 2

విడుదల తేదీలను ఇంకా ఖరారు చేయలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here