Nandamuri Balakrishna : ఓరి నాయనో.. యూఎస్ అభిమానులకు బాలయ్య అంటే అంత పిచ్చా..!!

- Advertisement -

Nandamuri Balakrishna : నందమూరి బాలయ్య అఖండ సినిమా తర్వాత ఫుల్ జోషులో తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న అంటే ఈరోజు ఉదయం చాలా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఎప్పటినుంచో ఉర్రూతలూగించే బాలయ్యను చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇకపోతే మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా..కలెక్షన్స్ గురించి తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా విడుదలయిన ఈ సినిమాపై అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య పై తన అభిమానం ఎలాంటిదో చూపించే ప్రయత్నం చేశారు యూఎస్ఏ అభిమానులు. ముఖ్యంగా యూఎస్ఏ లో బాలయ్య అభిమానులు.. బాలయ్య మరియు సీనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో ముద్రించిన టీ షర్ట్ లను ధరించి తమ ప్రేమను వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తే నందమూరి ఫ్యామిలీ అంటే వీరికి ఏ రేంజ్ లో పిచ్చి ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మొన్నామధ్య తమ కార్లకు అతికించిన, ముద్రించిన జెండాలు పోస్టర్లు పట్టుకొని ర్యాలీలు కూడా చేశారు అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి..

Veera simha reddy
Veera simha reddy

అమెరికాలో బాలయ్యకు ఫాలోయింగ్ ఎక్కువే..ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు ఇలా జెండాలు ప్లకార్డ్ లు పట్టుకొని.. టీ షర్ట్లు ధరించి సినిమాను హోరెత్తించారు. ఇకపోతే ప్రీమియర్ షో మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇక ట్విట్టర్ రివ్యూల ద్వారా అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షో చూసి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య అఖండ తర్వాత వీర సింహారెడ్డి సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పవచ్చు…అక్కడ ప్రీమియర్ షోలకు కూడా భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంది…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here