Veera Simha Reddy : వీర సింహా రెడ్డి పబ్లిక్ టాక్.. పూనకాలే..Veera Simha Reddy : ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్ కోరిక నేరవెరింది.. Veera Simha Reddy సినిమా థియెటర్లలో సందడి చేస్తుంది..గంట క్రితమే భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయ్యింది..బాలకృష్ణ, కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది..శ్రుతి హాసన్.. కథానాయికగా నటించగా, దునియా విజయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇక చిత్రం నుంచి విడుదలైన మాస్ సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు..

Veera Simha Reddy
Veera Simha Reddy

టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన మాస్ సాంగ్స్‌ను అభిమానులు వీర లెవెల్‌లో ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక పోతే వీరసింహా రెడ్డి’ ప్రస్తుతం 287 లొకేషన్స్ నుంచి $505,330 వసూల్ చేయగా, మరోవైపు మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య 274 స్థానాల నుంచి $398,160 కలెక్షన్లు వసూల్ చేసినట్టు తెలుస్తుంది.. అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో వీరసింహా రెడ్డి హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేయగా.. ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక యూఎస్ఏ ప్రీమియర్ గ్రాసర్‌గా నిలిచిందని అంటున్నారు. దుబాయ్‌లో ఉంటూ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకుంటూ సినీ విమర్శకుడిగా చెలామణీ అవుతోన్న ఉమైర్ సంధు ఇప్పటికే ఈ సినిమా గురించి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. బాలయ్య సినిమాకు 3.5 రేటింగ్ కూడా ఇచ్చారు..

veera simha reddy  Public Talk
veera simha reddy Public Talk

మాస్ ఆడియన్స్‌ను బాలకృష్ణ తన పంచ్ డైలాగులతో అలరించనున్నాడని కొన్ని సన్నివేశాల్లో తన భావోద్వేగ నటనతో కన్నీళ్లు కూడా పెట్టిస్తాడని అన్నాడు. ఇక సినిమాకి సంబంధించిన నాన్ స్టాప్ యాక్షన్ స్టంట్స్, స్టోరీ, స్క్రీన్‌ప్లే కొత్తగా ఏమీ లేకపోయినప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా, టైంపాస్ అయ్యే విధంగా ఉంటుందని ఉమైర్ తన సోషల్ మీడియా పేజ్‌లో రాసుకొచ్చాడు. టర్కీ లొకేషన్స్‌ను అద్భుతంగా చూపించారని, శృతిహాసన్ మరోసారి తన నటనతో కట్టిపడేసిందని పేర్కొన్నారు.

ఇక ఆఖరి 15 నిమిషాలు సినిమా అద్భుతం అని చెప్పిన దుబాయ్ రివ్యూయర్ ఇది పైసా వసూల్ మూవీ అని చెప్పుకొచ్చాడు.. కథ కొత్తగా ఉందని తెలుస్తుంది.. బాలయ్య రోల్స్ జనాలకు ఉత్సాహాన్ని ఇస్తుంది..గోపిచంద్ ఖాతాలో హిట్ సినిమా పడిందనే చెప్పాలి.. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరికీ వారే అన్నట్లు నటించారు.. ఈ సినిమాకు డైలాగులు ఎంత హైప్ ను క్రియేట్ చేసాయో, తమన్ మ్యూజిక్ ప్రాణం పోసింది..మొత్తానికి సినిమా మొదటి షో కే పాజిటివ్ టాక్ ను అందుకుంది..సినిమా హిట్ అని జనాలు అంటున్నారు. మరి సాయంత్రం వరకూ ఈ టాక్ ఉంటుందో లేదో చూడాలి..