Veerasimha Reddy : బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది..తాజాగా ఈ సినిమా థియెటర్లలో సందడి చేస్తుంది..భారీ అంచనాలతో బాలయ్య వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ‘వీరసింహారెడ్డి’ లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది… మొదటి ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అవుతూ వస్తున్నాయి.. దాంతో ఓ రేంజ్ లో ఊహించుకున్నారు బాలయ్య ఫ్యాన్స్..కానీ థమన్ మాటతో అంతా నీరు కారిపొయింది..మ్యూజిక్ డైరెక్టర్స్ తరచుగా కాపీ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. హాలీవుడ్డో, బాలీవుడ్డో నుండి ట్యూన్స్ లేపేస్తారనే వాదన ఉంది..
టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా చలామణి అయిన ప్రతి ఒక్కరూ ఈ కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందరితో పోల్చితే థమన్, దేవిశ్రీ ఎక్కువసార్లు బుక్ అయ్యారు. ప్రస్తుతం వారిద్దరే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావడం విశేషం. కాగా వీరసింహారెడ్డి చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టరన్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య’ తీవ్ర ఆరోపణలకు గురైంది. జై బాలయ్య సాంగ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒసేయ్ రాములమ్మా’ సాంగ్ ని పోలి ఉందని విమర్శలు చేశారు.ఇకపోతే..
తాజాగా స్పందించిన థమన్… జై బాలయ్య సాంగ్ ఒసేయ్ రాములమ్మ సాంగ్ నుండి కాపీ చేసిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. ఈ విషయం డైరెక్టర్ గోపీచంద్ మలినేని, లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రికి కూడా తెలుసని అన్నారు. వందేమాతరం శ్రీనివాస్ సర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి నేను పని చేశాను. ఆ పాట స్ఫూర్తితోనే జై బాలయ్య కంపోజ్ చేశానని ఒప్పుకున్నారు. దేవిశ్రీ కంపోజ్ చేసిన ‘వచ్చాడయ్యో సామీ’ సాంగ్ కి కూడా ఆధారం ఆ పాటనే అని వెల్లడించారు. అది కల్ట్ ఇమేజ్ ఉన్న పాటని నిజం ఒప్పుకున్నారు. కాగా అల వైకుంఠపురంలో చిత్రానికి థమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. యూట్యూబ్ ని షేక్ చేశాయి. ఆ దెబ్బతో థమన్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ పొజిషన్ కి వచ్చాడు ..ప్రస్తుతం స్టార్ హీరోలందరూ థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటున్నారు. నెక్స్ట్ మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేడు విడుదలైన వారసుడు చిత్రానికి కూడా థమన్ పని చేశారు..రామ్ చరణ్ సినిమాకు కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్..థమన్ చేసిన కాపీ ఎఫెక్ట్ సినిమా పై పడుతుందేమో చూడాలి..