Unstoppable : అన్‌స్టాపబుల్‌ షోలో సందడి చేయనున్న వీర సింహా రెడ్డి టీం..ఎప్పుడంటే?

- Advertisement -

Unstoppable With NBK : అఖండ తో భారీ హిట్ ను అందుకున్న బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. జనవరి 12, 2023 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతోంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

Unstoppable With NBK
Unstoppable With NBK

నందమూరి ఫ్యాన్స్‌ ఊహించినట్లుగానే ట్రైలర్‌ కేక పెట్టించింది. ఊరమాస్ డైలాగ్స్‌తో పాటు, యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్‌లో బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్‌తో పాటు భారీ మాస్ యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సన్నివేశాలు అదిరాయి.ఇకపోతే బాలయ్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలో టాక్ షోలు కూడా చేస్తున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఓటిటి టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 దూసుకు పోతుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకులతో సహా చాలా మంది ప్రముఖులు ఈ షో కి అతిథులు గా విచ్చేశారు. ఇప్పుడు ఆహా వీక్షకుల కోసం ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసింది..

Unstoppable With NBK
Unstoppable With NBK

ఈ షోకు షోకు వీర సింహా రెడ్డి టీం రానుంది. ఆహా వాళ్లు ముందుగా ప్రకటించినట్లుగా, రాబోయే ఎపిసోడ్‌లో వీరసింహా రెడ్డి టీమ్ కనిపించనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆహా మేకర్స్ విడుదల చేశారు. ఈ షోలో వీరసింహా రెడ్డి దర్శకుడు గోపిచంద్ మలినేని, నటి వరలక్ష్మీ శరత్ కుమార్, మైత్రీ మూవీ మేకర్స్ వారు సందడి చేసే పిక్స్ నెట్టింట విడుదల చేశారు.

- Advertisement -

అయితే వీర సింహా రెడ్డి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను త్వరలోనే ఆహా వారు విడుదల చేయనున్నారు ఈ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ కానుకగా జనవరి 13, 2023న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.అలాగే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ను అందుకున్న విషయం తెలిసిందే.. బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. 2 గంటల 50 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది..ఇక సినిమా జనాలను ఎలా అలరిస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here