Veera Simha Reddy : అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి ‘ చిత్రం భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది..అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యినప్పటికీ నందమూరి అభిమానుల్లో సంతోషం లేదు..ఎందుకంటే ఈ సినిమాతో పాటుగా పోటీగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ‘వీర సింహ రెడ్డి’ కంటే రెండింతలు ఎక్కువ వసూళ్లను రాబట్టడం.
దానానికి తోడు పండుగ సెలవుల్లో తప్ప మిగిలిన రోజుల్లో కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోవడం నందమూరి అభిమానులను నిరాశకి గురి చేసింది..మొదటి వారం లోనే సుమారుగా 70 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ చిత్రానికి ఆ తర్వాత రెండు వారాలకు కలిపి 74 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 12 వ రోజు నుండే ఈ సినిమాకి జీరో షేర్స్ రావడం ప్రారంభం అయ్యాయి.
అలా అన్ని చోట్ల డెఫిసిట్స్ రావడం తో కమిషన్ బేసిస్ మీద ఈ చిత్రాన్ని రన్ చేస్తున్నారు..అప్పటికీ కూడా ఈ సినిమాకి వస్తున్న షేర్స్ అంతంత మాత్రమే..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలలో తమిళ హీరో విజయ్ ‘వారసుడు’ కంటే ఈ చిత్రానికి తక్కువ వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..కనీసం రిపబ్లిక్ డే రోజైన డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ ఆశించింది..కానీ ఆరోజు ని కూడా ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయింది.
స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న వీర సింహా రెడ్డి సినిమాకి లాంగ్ రన్ ఇంత దారుణంగా ఉంటుందని ట్రేడ్ అంచనా వెయ్యలేకపోయింది.. సంక్రాంతి సెలవులను బాగా ఉపయోగించుకుంది కాబట్టే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది.. లేకపోతే బాలయ్య కెరీర్ లో ఫ్లాప్ గా మిగిలేది అంటున్నారు ట్రేడ్ పండితులు.. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే నందమూరి అభిమానులకు ఓపెనింగ్స్ లో ఒక రేంజ్ హై ఇచ్చిన ఈ సినిమా ఫుల్ రన్ లో మాత్రం నిరాశపరిచింది.