Veera Simha Reddy : అదిరిందయ్యా బాలయ్య.. చేతిలో మందు గ్లాసు.. పక్కన హనీ రోజ్‌Veera Simha Reddy : నందమూరి నటసింహం బాలకృష్ణ సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డిగా దిగారు. తన మార్కు ఫ్యాక్షనిజం.. మాస్ డైలాగులతో ప్రేక్షకులను మరోసారి మెప్పించారు. వసూళ్లలోనూ.. ప్రేక్షకులను అలరించడంలోనూ దూసుకెళ్తున్న ఈ సినిమా విజయోత్సవ వేడుకలను నిర్వహించింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ టీమ్ అంతా వీర సింహారెడ్డి సక్సెస్​ను ఫుల్ ఎంజాయ్​ చేస్తున్నారు.

Veera Simha Reddy
Veera Simha Reddy

అఖండతో బ్లాక్ బస్టర్ హిట్​ను అందుకున్న బాలయ్య.. తాజాగా వీరసింహారెడ్డితోనూ అంతకు మించిన హిట్​ను అందుకున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే మూవీటీమ్​.. సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. వీరమాస్‌ బ్లాక్‌బస్టర్‌ పేరుతో వేడుకను నిర్వహించింది. అయితే బాలయ్య ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ లెవల్స్ వేరే లెవల్లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్​లోనూ ఆయన తన మార్క్ ఉత్సాహంతో సందడి చేశారు.

balakrishna with honey rose

ఇక ఈ వేడుకలో టీమ్​తో పాటు యంగ్ హీరోస్​ విశ్వక్ సేన్, సిద్ధుసిద్ధు జొన్నలగడ్డతోపాటు దర్శకులు హరీష్‌శంకర్‌, అనిల్‌ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ కూడా హాజరై ఎంజాయ్ చేశారు. మొత్తంగా ఈ ఈవెంట్ అంతా సందడి సందడిగా సాగింది. దీని తర్వాత వీరంతా కలిసి ఓ స్పెషల్​ పార్టీ కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను హీరో విశ్వక్ సేన్ తన ఇన్​స్టాలో కూడా పోస్ట్ చేశారు.

అయితే ఓ ఫొటోలో బాలయ్య, వీరసింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్​తో కలిసి కిరాక్ పోజులో కనిపించారు. ఇద్దరి చేతుల్లో డ్రింక్ గ్లాసులు కనిపించాయి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇంకా చెప్పాలంటే ఆ ఈవెంట్​కే స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ అయితే.. ‘అదిరిందయ్యా బాలయ్య చేతిలో గ్లాసూ… పక్కన హనీ రోజూ..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఒక్కొక్కసారి ఒక్క డైలాగ్‌ నుంచి, ఒక్క మేనరిజమ్‌ నుంచే కథ పుడుతుంటుంది. దీనికి ఆద్యుడు మా బోయపాటి శ్రీను. గోపీచంద్‌ మలినేని నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఆలోచించాం. అప్పుడే సీమ రక్తం కుతకుతలాడుతోందని అన్నా. నా అభిమాని కాబట్టి గోపీచంద్‌ మలినేని వెంటనే ‘చెన్నకేశవరెడ్డి’ అన్నాడు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ చేశాడు. ఇది కథ కూడా కాదు, ఇదొక ప్రయాణం. తెలుగు ప్రేక్షకులతోపాటు, ఇతర భాషలకి చెందిన  అభిమానులు కూడా ఈ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. మాటల్లోనూ, పాటల్లోనూ అద్భుతమైన పనితీరు కనబరిచారు సాయిమాధవ్‌ బుర్రా, రామజోగయ్యశాస్త్రి. తమన్‌ సంగీతం అద్భుతంగా ఉంది. ఒకొక్క పాట నా ఆహార్యానికి సరిపడేలా ఉంటుంది. ఇదొక విస్ఫోటనం అని చెప్పా. అన్నట్టుగానే ఈ సినిమా గొప్ప విజయం సాధించింది’’ అన్నారు.

‘‘ఈ చిత్ర విజయంలో నేను భాగం కావడం, మీనాక్షి పాత్ర దొరకడం గొప్ప వరం’’ అన్నారు హనీరోజ్‌. డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో బాలకృష్ణతో ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఇంత మంచి అవకాశాన్నిచ్చిన కథానాయకుడు బాలకృష్ణకి రుణపడి ఉంటా. ఒక అభిమానిగా ఈ సినిమా చేశా. ఫ్యాన్‌ మూమెంట్స్‌, ఫ్యామిలీ మూమెంట్స్‌ ఇందులో ఉన్నాయి. అభిమానులు, కుటుంబ ప్రేక్షకులవల్లే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది’’ అన్నారు.