భర్తగా వరుణ్ తేజ్ కంటే సాయి ధరమ్ తేజ్ బెటర్.. లావణ్య త్రిపాఠి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్కోట్లాది మంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధ వేడుక నిన్న హైదరాబాద్ లోని నాగబాబు నివాసం లో అంగరంగ వైభవం గా జరిగింది. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ కి సంబంధించిన వాళ్లంతా హాజరయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ప్రస్తుతం ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి

ఇదంతా పక్కన పెడితే లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ప్రేమ ‘మిస్టర్’ అనే చిత్రం తో మొదలైంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా వాళ్ళిద్దరి కెరీర్ లో కమర్షియల్ గా కెరీర్ పరంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, వాళ్ళ మధ్య ఒక అనుబంధం ని ఏర్పాటు చెయ్యడం లో మాత్రం సక్సెస్ అయ్యింది. అప్పటి నుండి వీళ్ళిద్దరూ ఒకరికొకరు స్నేహం గా మెలుగుతూ ఉంటూ వచ్చారు.

Lavanya tripathi

అలా వీళ్లిద్దరి స్నేహం కాస్త కాలం గడిచేకొద్దీ ప్రేమగా మారింది, సుమారుగా 7 ఏళ్ళ నుండి వీళ్లిద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే గతం లో ఈమె ఒక సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొనగా, అప్పుడు యాంకర్ అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్ననలో ‘బెస్ట్ హస్బెండ్(భర్త) మెటీరియల్ ఎవరు? ‘ అని అడిగిన ప్రశ్నకి , లావణ్య త్రిపాఠి సమాధానం చెప్తూ ‘సాయి ధరమ్ తేజ్ పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్. వరుణ్ తేజ్ కూడా అలాంటి వాడే కానీ, సాయి ధరమ్ తేజ్ మాత్రం నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా మంచివాడు, అతను భర్త గా కావాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.

ఆ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. వరుణ్ తేజ్ తో 7 ఏళ్ళ నుండి రిలేషన్ లో ఉన్న లావణ్య త్రిపాఠికి ‘సాయి ధరమ్ తేజ్’ ది బెస్ట్ ఎందుకు అనిపించాడు, వరుణ్ తేజ్ ని తక్కువ చేసి ఎందుకు మాట్లాడింది, ఇలాంటి సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.