Urfi Javed : నాకు బట్టలంటే అలెర్జీ అందుకే.. సెన్సేషనల్ పోస్టు చేసిన ఉర్ఫీ జావేద్

- Advertisement -

Urfi Javed .. సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ ఓ సెన్సేషన్. ఈ బ్యూటీ గురించి తెలియని నెటిజన్ ఉండడు అంటే నమ్మశక్యం కాదు. అరకొర దుస్తులతో.. అసలు ఒంటి మీద ఏం లేనట్టు అనిపించేలా.. తన సొగసులన్నీ చూపించడం ఈ భామకు బాగా అలవాటు. ఈమె డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డోర్ మ్యాట్, కూల్ డ్రింక్, ఫోన్ కేసు ఇలా చిత్రవిచిత్రమైన మెటీరియల్స్ తో చాలా వెరైటీ డిజైన్లతో ఈ బ్యూటీ డ్రెస్సింగ్ ఉంటుంది.

Urfi Javed
Urfi Javed

ఈ బ్యూటీకి డ్రెస్సింగ్ స్టైల్ ను చాలా మంది విమర్శిస్తుంటారు. కానీ తనకు నచ్చినట్లు తాను ఉంటుందంటూ ఈ భామకు ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉన్నారు. ఈ బ్యూటీ క్రేజ్ తెలుసుకోవాలంటే ఉర్ఫీ సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్స్ సంఖ్యను చూస్తే సరిపోతుంది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. డిఫరెంట్ లుక్స్ తో.. వెరైటీ అవుట్ ఫిట్స్ లో రెచ్చగొట్టే పోజులిస్తూ ఈ భామ తరచూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

Urfi Javed photos
Urfi Javed photos

తాజాగా ఉర్ఫీ జావేద్ చేసిన ఇన్ స్టా పోస్టు తెగ వైరల్ అవుతోంది.  “బట్టలు నా ఒంటికి అంటుకుంటే అలెర్జీ“ అని చెబుతూ ఏవగించుకుంటూ ఉర్ఫీ ఓ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ ్వుతోంది. ఉర్ఫీ ఉన్ని దుస్తులను ధరించిన తర్వాత తనకు ఎలా దద్దుర్లు వచ్చాయో ఈ పోస్టులో చూపించింది. తన `అలెర్జిక్ వ్యథ` గోడును ఫ్యాన్స్ తో వెల్లబోసుకుంది.

దద్దుర్లు బొడిపెలతో నిండిన ఆమె కాళ్ల ఫొటోను కూడా ఉర్ఫీ షేర్ చేసింది. చలికాలంలో ఎవరికైనా ఇలాంటి అలర్జీలు వస్తాయా? అంటూ ప్రశ్నించింది. అవును లేదా కాదు అని జవాబివ్వాలని తన ఫాలోవర్స్ ని కోరింది. భారతదేశంలోని లక్షలాది మంది నెటిజన్ లకు ఉర్ఫీ జావేద్ వేషధారణపై అవగాహన ఉంది.  ఏదైనా కొత్తదనం ఇంకేదైనా సంథింగ్ లేనిదే ఉర్ఫీ లేనే లేదు. ప్రత్యేకమైన వింత దుస్తులను ధరించడాన్ని అమితంగా ఇష్టపడుతుంది. ఉర్ఫీ ఫ్యాషన్ సెన్స్ కోట్లాది మంది తనవైపు చూసేలా చేసింది.

అసలు తాను అలాంటి దుస్తులను ఎందుకు ధరించాల్సి వచ్చిందో మౌనం వీడింది ఉర్ఫీ. ఇన్ స్టా కథనాలలో “నాకు బట్టలు అంటే అలెర్జీ“అని తెలిసింది. అసలు సంగతిని తన ఫాలోవర్స్ కు క్లియర్ గా చెప్పింది. ఉర్ఫీ జావేద్ తన మొదటి స్టోరీలో దద్దుర్లతో నిండిన తన కాళ్ల ఫొటోను షేర్ చేసింది. చలికాలంలో ఎవరికైనా ఇలాంటి అలెర్జీలు వస్తాయా? అని ప్రశ్నించింది. దీనికి అవును లేదా కాదు అనే ఆప్షన్ లు ఇచ్చి అభిప్రాయాలు కోరింది. తన కాళ్ల దుస్థితికి సంబంధించిన మరో వీడియోను షేర్ చేసి “నాకు బట్టలంటే అక్షరాలా ఎలర్జీ“ అని క్యాప్షన్ ఇచ్చింది. కాబట్టి నేను బట్టలు ఎందుకు ధరించడం లేదో ఇప్పుడు మీకు బాగా తెలిసిందనుకుంటా అంటూ పోస్ట్ పెట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here