Salaar విడుదలపై క్లారిటీ.. ఊపిరిపీల్చుకుంటున్న ఫ్యాన్స్!

- Advertisement -

Salaar : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పోతేపోయింది. ఎలాగూ.. మనకు కావాల్సిన యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ వస్తుందిగా అని లైట్ తీసుకున్నారు. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటే.. మాములు విషయం కాదు.

Salaar
Salaar

ఇక ఈ సినిమా ఎప్పడైతే అనౌన్స్ అయ్యిందో.. అప్పటినుంచి రిలీజ్ ఎప్పుడు.. రిలీజ్ ఎప్పుడు అని అభిమానులు కాచుకొని కూర్చున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ఎన్ని రికార్డులు ఉంటే అన్ని రికార్డులను తిరగరాశాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక మొదట నుంచి సలార్ 2023 లోనే రిలీజ్ అవుతుంది అని చెప్తూనే వస్తున్నారు. మొదట ఏప్రిల్ అన్నారు.. అది పోయింది.. సరే సెప్టెంబర్ లో వస్తుంది అని చెప్పారుగా.. పర్లేదు ఎదురుచూద్దాం అని అనుకుంటే.. గతకొన్నిరోజుల నుంచి ఈసారి కూడా సలార్ వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలు అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

salaar

ఇక ఈ వాయిదాలు అలవాటు పడ్డ డార్లింగ్ ఫ్యాన్స్ గుండెలను దిటవు చేసుకొని కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది వచ్చేలా చూడు దేవుడా అని కోరుకుంటున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. సలార్ ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలుస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ లోనే సలార్ ను రిలీజ్ చేయనున్నామని మేకర్స్.. డిస్ట్రిబ్యూటర్స్ తో తెలిపినట్లు టాక్ నడుస్తోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. హమ్మయ్య డైనోసర్ రాక ఈ ఏడాదే అని సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here