అనుకున్నంత పన్నైంది.. సలార్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశే మిగిలిందిగా

- Advertisement -

ప్ర‌భాస్ స‌లార్ మూవీ పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డిసెంబ‌ర్‌కు షిప్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆగ‌స్ట్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

కానీ ఆ హామీని నిల‌బెట్ట‌లేక‌పోయింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల ట్రైల‌ర్ రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోన్న‌ట్లు ఇటీవ‌ల వెల్ల‌డించింది. స‌లార్‌ రిలీజ్‌కు మ‌రో 27 రోజులే టైమ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ట్రైల‌ర్ రిలీజ్ డేట్‌పై మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌క‌పోడం, ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌క‌పోవ‌డంతో పోస్ట్‌పోన్ రూమ‌ర్స్‌కు బ‌లాన్ని చేకూర్చుతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తికాలేద‌ని స‌మాచారం.

ముఖ్యంగా సీజీ వ‌ర్క్ విష‌యంలో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ అసంతృప్తితో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ వ‌ర్క్ మొత్తం మ‌ళ్లీ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. సెప్టెంబ‌ర్ 28లోగా ఈ సీజీ వ‌ర్క్‌ కంప్లీట్ అయ్యే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. అందువ‌ల్లే సినిమా రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేయాల‌నే యోచ‌న‌లో యూనిట్ ఉన్న‌ట్లు స‌మాచారం. దాదాపు రెండు వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్‌గా ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here