ఆకలితో ఉన్న చిరుత వచ్చేస్తోంది.. అదిరిపోయిన ఓజీ గ్లింప్స్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాన్​ ఇటీవలే బ్రో సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలతో బిజీ షెడ్యూల్ మెయింటేన్ చేస్తున్నారు. వాటిల ఓజీ ఒకటి. సాహో లాంటి పాన్ ఇండియా సినిమాను డైరెక్షన్ చేసిన సుజిత్ ఈ ఓజీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘ఓజీ’ . ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనేది ఫుల్ టైటిల్. ఓజీ అంటే ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అని అర్థం. పవర్ స్టార్ ఫ్యాన్ సగటు సినిమా ప్రేక్షకుల్లో ఈ మధ్యకాలంలో పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియోలతో ఆసక్తి కలిగించిన సినిమా ఓజీ తప్ప మరొకటి లేదు.

‘ఓజీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుజీత్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమైన మాఫియా నేపథ్యంలోని జానర్ సినిమా ఇది. దాంతోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం ఓజీ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘Hungry Cheetah’ అంటూ ‘ఓజీ’ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. పేరుకు తగ్గట్టుగానే చిరుత పులిలా పవన్ వేట సాగింది. పవన్ నుంచి ఆయన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఓ వీరాభిమానిగా ఆ అంశాలనే ప్రాధానంగా చూపించారు సుజీత్. పవన్ కళ్యాణ్ స్వాగ్ కు తోడు థమన్ నేపథ్య సంగీతం, విజువల్స్, సుజీత్ డైరెక్టన్ తో గ్లింప్స్ అభిమానులకు ఫుల్ కిక్కు అందించింది. ఓజీ వీడియో గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. మొత్తానికి ఓజీతో పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ ముంబై, పూణే, హైదరాబాద్ షెడ్యూల్స్ లో కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య ‘ఓజీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here