Dasara Movie క్లైమాక్స్ ముందు ‘కాంతారా’ మూవీ క్లైమాక్స్ ఏమాత్రం పనికిరాదా..!

- Advertisement -

Dasara Movie : న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. హీరో నాని మొదటి నుండి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.ప్రొమోషన్స్ లో కూడా ‘కాంతారా’ లాంటి సినిమా మన టాలీవుడ్ నుండి వస్తుంది అంటూ గర్వంగా చెప్పుకొని తిరిగేవాడు.అతని మాటలని వినండి చాలా మంది ఓవర్ కాంఫిడెన్స్ అని అనుకున్నారు.

Dasara Movie
Dasara Movie

కానీ ఈరోజు సినిమా చూసిన తర్వాత అది ఓవర్ కాంఫిడెన్స్ కాదు, నిజం అనే విషయం అర్థం అవుతాది.సినిమాలో చాలా సన్నివేశాలు ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయి.ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశానికి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.అసలు ఆ సన్నివేశాన్ని డైరెక్టర్ ఈ రేంజ్ లో ఎలా ఆలోచించాడు అని ఆశ్చర్యపోక తప్పదు.అంత అద్భుతంగా తీసాడు ఆ షాట్.

Dasara Movie Climax

థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా మనల్ని ఆ షాట్ వెంటాడుతూనే ఉంటుంది.కేవలం ఆ షాట్ కోసమే మరోసారి సినిమా చూడాలి అనిపిస్తాది.ఆ రేంజ్ లో తీసాడు, ఇక క్లైమాక్స్ సన్నివేశం కూడా అదే రేంజ్ లో ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ఫైట్ మొత్తం మన రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది.బగబగ మండుతున్న రావణాసురిడి బొమ్మలో నుండి హీరో నాని దూకుతూ విలన్ తలని తరికే సన్నివేశం కి సంబంధించిన థియేట్రికల్ అనుభవం అద్భుతం.

- Advertisement -
Nani Dasara Movie

కేవలం ఈ రెండు సన్నివేశాల కోసం దసరా మూవీ ని ఎన్ని సార్లు అయినా థియేటర్స్ లో చూడవచ్చు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కి ఇది మొదటి సినిమానే అవ్వొచ్చు, కానీ అతనికి ఉన్న షాట్ మేకింగ్ స్కిల్స్ టాలీవుడ్ లో పెద్ద డైరెక్టర్స్ గా చెప్పుకునే ఎంతో మందికి లేదనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయన వెంట స్టార్ హీరోలు పడడం ఖాయం.ప్రతీ ఒక్కరు ‘కాంతారా’ క్లైమాక్స్ ని తెగ లేపుతారు కానీ, ఈ చిత్రం లోని క్లైమాక్స్ సన్నివేశం ముందు అసలు ‘కాంతారా‘ క్లైమాక్స్ పనికిరాదనే చెప్పాలి. అదిరిపొయ్యే పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకున్న ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Nani Keerthy SUresh
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here