Samantha : సమంత కళ్లద్దాలు అందుకే పెట్టుకుంటుందా.. అయ్యో పాపం..

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య మూడు నాళ్ళ ముచ్చటగానే విడిపోయారు.. తాజాగా మరో మారు విడాకులు గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.. ఈ మధ్య సమంత కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు. స్టైల్ కోసం కళ్ళద్దాలు పెడుతున్నారని చాలామంది భావించారు. నిజానికి సమంత అందం కోసం స్పెడ్స్ పెట్టుకోవడం లేదంట.. దాని వెనకమాల వేరే కారణం ఉందని తనే స్వయంగా తెలిపారు..

Samantha
Samantha

నిజానికి సమంత మాత్రం తన ఆరోగ్య సమస్యల వల్లే కళ్లద్దాలను ధరిస్తున్నారని స్పష్టం చేశారు. నేను కళ్లద్దాలను ధరించడానికి ముఖ్య కారణం ఏమిటంటే నా కళ్ళు వెలుతురుని తట్టుకోలేవని.. అందువల్లే నేను కళ్లద్దాలను పెట్టుకుంటున్నానని ఆమె చెప్పారు. ఆరోగ్య సమస్యల వల్ల ఒక్కసారి ఒక్కో లుక్ ఫేడ్ అవుట్ అవుతుందని.. అటువంటప్పుడు అలాంటి మాటలు నేను పట్టించుకోనని తెలిపారు. నేను ఇప్పటికే ఎన్నో బాధలను అనుభవిస్తున్నానని వాటితో పోలిస్తే ఈ మాటలు పెద్దవి కాదని.. మనోధైర్యంతో అన్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నానని అందంతో పోల్చుకుంటే ఈ బ్యూటిఫుల్ గా ఫేస్ కోసం ఎంతగానో కష్టపడుతున్నానని అన్నారు.

సమంత ఇటీవల మయోసైటీస్ అని అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోల్కొని షూటింగ్లలో పాల్గొంటుంది. మయోసైటిస్ నుంచి బయట పడేందుకు ప్రతినిత్యం మెడికేషన్ చేస్తున్నాను.. ఆ సమస్య కారణం గానే.. నేను కొన్నిసార్లు నేను బొద్దుగా కనిపిస్తున్నానని.. మరికొన్నిసార్లు నీరసంగా కనిపిస్తానని ఆమె చెప్పారు. నా కళ్ళు వెలుతురుని తట్టుకోలేవని మరొకరికి ఇలాంటి బాధ రాకూడదు అని సమంత అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -
Samantha

నేను బాధను అనుభవిస్తున్నానని గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నామని ఆమె కామెంట్లు చేశారు. ఎన్నో సమస్యల్ని దాటుకొని ఈ స్థాయికి వచ్చానని సమంత అన్నారు. సమంత నటించిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సమంత వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ సినిమా సమంతకు ఎలాంటి క్రేజ్ ను తీసుకొస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here